Salt vs Pink Salt: ఏ రంగు ఉప్పు ఆరోగ్యానికి మంచిది? ఎవరు ఏ ఉప్పు తినాలో తెలుసా?

Published : Oct 14, 2026, 01:42 PM IST

Salt vs Pink Salt: మార్కెట్లో చాలా రకాల ఉప్పులు ఉన్నాయి. అన్నింట్లో కెల్లా పింక్ సాల్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది అనే భావన చాలా మందిలో ఉంటుంది. అందులో నిజం ఎంత?

PREV
14
ఏ ఉప్పు తినాలి?

కూరలో ఉప్పు లేకపోతే ముద్ద కూడా దిగదు. పప్పు నుంచి పచ్చళ్ల వరకు ప్రతీ వంటకంలోనూ కచ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. అయితే.. మార్కెట్లో చాలా రకాల ఉప్పులు ఉన్నాయి. వైట్ సాల్ట్ తో పాటు పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ మార్కెట్లో లభిస్తున్నాయి. కొందరు పింక్ సాల్ట్ మంచిది అనుకుంటే, మరి కొందరు.. బ్లాక్ సాల్ట్ ఇంకా మంచిది అనుకొని వంటలో వాడేస్తున్నారు. అసలు.. ఏ ఉప్పు తినడం మంచిది? అసలు ఏ ఉప్పు ఎవరు తినాలో తెలుసా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...

24
వైట్ సాల్ట్ ఎవరు తినాలి?

దాదాపు అందరు ఇళ్ల ల్లో సాధారణంగా వాడే ఉప్పు ఇది. ఈ ఉప్పు ని సముద్రపు నీరు లేదా భూగర్భంలోని ఉప్పు నిల్వల నుంచి తయారు చేస్తారు. ఉప్పులోని మలినాలను తొలగించి, శుద్ధి చేసి, స్పటికాల రూపంలో తయారు చేస్తారు. దీనిలో ప్రధానంగా సోడియం క్లోరైడ్ ఉంటుంది. మార్కెట్లో లభించే చాలా రకాల వైట్ సాల్ట్ లో అయోడిన్ కూడా కలుపుతారు. శరీరానికి థైరాయిడ్ హార్మోన్ల తయారీలో అయోడిన్ చాలా అవసరం. ఆహారంలో అయోడిన్ తగినంతగా అందని వారిలో థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. అందుకే అయోడిన్ ఉన్న ఉప్పును కచ్చితంగా తీసుకోవాలి.

సాధారణంగా రోజువారీ వంటల్లో ఉపయోగించేందుకు అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పు బెస్ట్ ఆప్షన్. ఆహారం ద్వారా తగినంత అయోడిన్ అందని వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే తెల్ల ఉప్పు అయినా, అయోడిన్ కలిపిన ఉప్పు అయినా ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. తెల్ల ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. అవసరానికి మించి సోడియం తీసుకోవడం రక్తపోటు పెరగడానికి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరగడానికి దోహదపడవచ్చు. అందువల్ల ఉప్పును పరిమితంగా వాడాలి.

34
2.పింక్ సాల్ట్ ఎవరు వాడాలి?

పింక్ సాల్ట్‌ను సాధారణంగా హిమాలయన్ పింక్ సాల్ట్ అని పిలుస్తారు. ఇది భూగర్భంలోని ఉప్పు నిల్వల నుంచి తవ్వి తీస్తారు. ఇందులో ఉండే ఐరన్ సమ్మేళనాలు సహా స్వల్ప ఖనిజాల వల్ల గులాబీ రంగు కనిపిస్తుంది. పింక్ సాల్ట్‌లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు స్వల్ప పరిమాణాల్లో ఉండవచ్చు. అయితే ఇవి సాధారణంగా మన రోజువారీ పోషక అవసరాలను తీర్చేంత పరిమాణంలో ఉండవు. అందువల్ల పింక్ సాల్ట్ తింటేనే శరీరానికి ఎక్కువ ఖనిజాలు అందుతాయని లేదా అది సాధారణ ఉప్పు కంటే ఎంతో ఆరోగ్యకరమని చెప్పడం సరికాదు.

ఎవరు ఈ ఉప్పును ఎంచుకోవచ్చు?

రుచి, రంగు లేదా వంటకానికి ప్రత్యేకమైన రూపం కోసం పింక్ సాల్ట్‌ను ఎంచుకోవచ్చు. సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా వాడాలనుకుంటే, అందులో అయోడిన్ ఉందో లేదో లేబుల్‌పై పరిశీలించాలి. అయోడిన్ కలపని పింక్ సాల్ట్‌ను మాత్రమే వాడుతూ, ఇతర ఆహారాల నుంచి అయోడిన్ తగినంతగా అందకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

44
నల్ల ఉప్పు.. ఎలా వాడాలి?

నల్ల ఉప్పును కాలా నమక్ అని కూడా అంటారు. భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా చాట్‌లు, పండ్ల సలాడ్లు, రుచికరమైన పానీయాల్లో దీన్ని ఉపయోగిస్తారు. దీని ప్రత్యేకమైన వాసన, స్వల్పంగా గంధకం లాంటి రుచి కారణంగా ఇతర ఉప్పుల కంటే భిన్నంగా ఉంటుంది. ఉప్పును వేడి చేయడం, కొన్ని ఖనిజ పదార్థాలతో ప్రాసెస్ చేయడం ద్వారా నల్ల ఉప్పును తయారు చేస్తారు.

ఈ ఉప్పు ఎవరు తినాలి..?

చాట్‌లు, పండ్ల ముక్కలు, సలాడ్లు వంటి వంటకాలకు ప్రత్యేకమైన రుచి కావాలనుకునేవారు కొద్దిగా వాడుకోవచ్చు. నల్ల ఉప్పులో అయోడిన్ మాత్రం లభించదు. కేవలం రుచి కోసమే మాత్రమే వాడాలి.

Read more Photos on
click me!

Recommended Stories