తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది?

First Published | Jan 20, 2024, 11:47 AM IST

White hair: తెల్ల జుట్టు వయసు మీద పడుతుండటాన్ని సూచిస్తుంది. ఇది ఒకప్పటి సంగతి. కానీ ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసు వారికి కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయో తెలుసా? 
 

తెల్ల వెంట్రుకలు ఒకప్పుడు వయసు మీద పడుతుండటాన్ని సూచించేవి. ఇప్పుడు ఈ తెల్ల వెంట్రుకలు చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి. దీనికి తోడు చుండ్రు, హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ వంటి సమస్యలతో నేడు చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడుతోంది. ఒక ఒకప్పటి విషయానికొస్తే 35 నుంచి 40 ఏండ్ల వయసులో వారికే తెల్ల జుట్టు వచ్చేది. కానీ ఇప్పుడు పదేళ్ల పిల్లల జుట్టు కూడా తెల్లబడుతోంది. 
 

ఇక ఈ తెల్ల జుట్టును దాచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు గోరింటాకు లేదా రంగులను వేస్తుంటారు. కానీ ఇవి వాడినా.. కొంత కాలానికే జుట్టు  మళ్లీ తెల్లబడటం మొదలవుతుంది. నిజానికి శరీరంలో కొన్ని విటమిన్లు లోపించడం వల్లే నల్ల జుట్టు తెల్లబడుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఏ విటమిన్ లోపం వల్ల నల్ల జుట్టు తెల్లగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


విటమిన్ బి12

మన శరీరానికి విటమిన్ బి 12 చాలా అవసరం. అయితే ఇది లోపించడం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుందని నిపుణులు అంటున్నారు. అవును మీ శరీరంలో తగినంత విటమిన్ బి 12 లేకపోయినా, లేదా విటమిన్ బి 12 ఆహారం నుంచి సరిగా గ్రహించబడనప్పుడు జుట్టును నల్లగా ఉంచే మెలనిన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దీనివల్ల జుట్టు బూడిద రంగులోకి తర్వాత తెల్లగా మారుతుంది. ఏదైనా ఫోలికల్ మెలనిన్ ఉత్పత్తిని ఆపివేసిన తర్వాత అది మళ్లీ తిరిగి ఉత్పత్తి చేయడం ఆగిపోతుంది. అంతే ఇక మీ జుట్టు తెల్లగా కపిపించడం ప్రారంభమవుతుంది. 
 

ఈ విటమిన్ బి 12 మన జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ ను తీసుకెళ్లే ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ బి 12 స్థాయిలు తగ్గడం వల్ల పోషణ మీ జుట్టు కుదుళ్లకు చేరదు. దీనివల్ల  జుట్టు తెల్లబడటం ప్రారంభిస్తుంది.  అంతేకాదు దీంతో మీ జుట్టు కూడా రాలడం స్టార్ట్ అవుతుంది. మీకు తెలియని విషయం ఏంటంటే.. ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే వారి జుట్టు కూడా చిన్న వయసులోనే తెల్ల బడటం మొదలవుతుంది. 


జుట్టు తెల్ల బడొద్దంటే ఏం చేయాలి?

మీ జుట్టు తెల్ల బడకూడదంటే విటమిన్ బి 12 ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి.

అలాగే మాంసం, చేపలు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులను కూడా తినండి. వీటిలో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. 

స్మోకింగ్ చేయకూడదు. 

యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజూ ధ్యానం చేయండి. 

Latest Videos

click me!