మాఘమాసం ఎప్పుడొస్తుంది? అప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదంటే?

First Published | Jan 20, 2024, 9:43 AM IST

Magha masam 2024: మాఘ మాసం ఈ ఏడాది జనవరి 26న ప్రారంభమవుతుంది. మాఘ మాసంలో చేసిన కర్మ ఫలాలు ఎన్నో జన్మలకు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో నిరుపేదలకు సహాయం చేయాలంటారు. అలాగే ఈ మాఘమాసానికి సంబంధించిన ఎన్నో నియమాలను పాటిస్తారు. వీటిని తప్పక పాటించాలని పండితులు చెప్తారు. అందుకే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

magha masam

సనాతన ధర్మంలో మాఘ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో స్నానం చేయడం, దానం చేయడం, ధ్యానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ ఏడాది మాఘ మాసం జనవరి 26 నుంచి ప్రారంభం అవుతుంది. జ్యోతిష్యలు ప్రకారం.. మాఘ మాసంలో చేసే కర్మ ఫలాలు ఎన్నో జన్మలకు లభిస్తాయని నమ్ముతారు.

అందుకే ఈ మాసంలో నిరుపేదలకు సహాయం చేయాలి. అలాగే ఈ మాసంలో పాటించాల్సిన నియమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవి పాటిస్తే శుభఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


మాఘమాసంలో ఏం చేయకూడదు? ఏం చేయాలి?

మాఘ మాసంలో తప్పనిసరిగా సూర్యభగవానుడిని పూజిస్తారు. అలాగే ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించే సంప్రదాయం కూడా ఉంది.

ఈ మాసంలో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.

మాఘమాసంలో ప్రతి రోజూ గీత పారాయణం చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు.

మాఘ మాసంలో చాలా మంది పవిత్ర నదుల్లో స్నానమాచరిస్తారు. ఇది మనం చేసిన పాపాలన్నీ తొలగిస్తుందని నమ్మకం ఉంది.

మాఘ మాసంలో తులసి మాతను పూజించాలనే నియమం ఉంది.

ఈ మాసంలో వెచ్చని వస్త్రాలను దానం చేయడం మంచిది.

మాఘమాసంలో ఏం చేయకూడదు?

మాఘ మాసంలో తామసిక ఆహారాలను తినకూడదు. 

మాఘ మాసంలో ముల్లంగిని తినడం కూడా పూర్తిగా నిషిద్ధం.

ఈ మాసంలో గంగానదిలో స్నానం చేయడం వల్ల ఇంటికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెప్తారు.

ఈ మాసం మొత్తం సాత్విక ఆహారాలను మాత్రమే తినాలి. 

ఈ నెలలో గొడవలకు దూరంగా ఉండండి.

మాఘంలో ఏ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలి.

Latest Videos

click me!