మాంసాహారం: రాత్రి సమయంలో ఎక్కువగా పొట్ట నిండా చికెన్, మటన్ ఫ్రైలు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అంతేకాదు ఎక్కువ మొత్తంలో చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తింటే మీకు కన్ఫామ్ గా పొట్ట వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆహారాలు అంత తొందరగా అరగవు. అందులోనూ వీటితో శరీరంలో ఫ్యాట్ పేరుకుపోతుంది. ఒకవేల తినాలనుకుంటే ఏడు గంటల లోపే మాంసాహారం తినండి. తినడానికి పడుకోవడానికి రెండు గంటల గ్యాప్ ఉండేట్టు చూసుకోండి.