గోళ్లు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పనులు చెయ్యాల్సిందే.. అవి ఏంటంటే?

Published : Mar 19, 2022, 12:14 PM IST

గోళ్లు (Nails) అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. అప్పుడే సహజసిద్ధమైన మెరుపుతో ఆరోగ్యంగా ఉంటాయి. ఇందుకోసం ఇంటిలోనే సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేసుకునే స్క్రబ్స్ (Scrubs) ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.  

PREV
16
గోళ్లు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పనులు చెయ్యాల్సిందే.. అవి ఏంటంటే?
Nails

గోళ్ల అందానికి రంగురంగుల నెయిల్ పాలిష్, దాని మీద డిజైన్లు వేసుకుంటే అందంగా కనిపిస్తాయే తప్ప అవి ఆరోగ్యంగా సహజ సిద్ధమైన మెరుపుతో ఉండవు. కనుక గోళ్లు అందంగా (Beautifully) ఆరోగ్యంగా (Healthy) ఉండాలంటే వాటికి తగిన పోషణ తప్పనిసరి. ఇందుకోసం కొన్ని రకాల స్క్రబ్స్ ను ప్రయత్నించడం మంచిది.
 

26
Nails

ఇవి గోళ్లు విరిగిపోకుండా (Without breaking) దృఢంగా (Strong) ఉండటానికి సహాయపడుతాయి. అంతేకాకుండా ఇవి మురికి తొలగించి గోళ్లను శుభ్రంగా ఉంచుతాయి. అలాగే గోళ్లకు సహజసిద్దమైన మెరుపును అందించి గోళ్ల  చుట్టూ ఉన్న చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి గోళ్ల పెరుగుదలకు సహాయపడుతాయి. 
 

36
Nails

పచ్చిపాలు, రోజ్ వాటర్: ఒక గిన్నెలో పావు కప్పు పచ్చి పాలు (Milk), పావు కప్పు రోజ్ వాటర్ (Rose water) తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో గోళ్లు మునిగేలా ఉంచాలి. పదిహేను నిమిషాల తర్వాత తీసి తడి వస్త్రంతో తుడుచుకోవాలి. ఈ మిశ్రమం గోళ్లకు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ లా సహాయపడుతుంది.
 

46
Nails

పాల మీగడ, గ్లిజరిన్, విటమిన్ ఈ నూనె: ఒక కప్పులో సగం స్పూన్ పాల మీగడ (Milk cream), సగం స్పూన్ గ్లిజరిన్ (Glycerin), కొన్ని చుక్కల విటమిన్ ఈ నూనె (Vitamin E oil) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోళ్లకు సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఈ మిశ్రమం గోళ్లను తేమను అందించి దృఢంగా మారుస్తాయి. అలాగే గోళ్లు విరిగిపోయే సమస్యలు కూడా తగ్గుతాయి.
 

56
Nails

కాఫీ పొడి, కొబ్బరి నూనె: ఒక కప్పులో కొద్దిగా కాఫీ పొడి (Coffee powder), కొద్దిగా కొబ్బరి నూనె (Coconut oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని గోళ్లపై సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఈ మిశ్రమం గోళ్లలో పేరుకుపోయిన మురికిని తొలగించి కింది చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గోళ్ళకు మంచి నిగారింపు కూడా అందిస్తుంది.
 

66
Nails

కొబ్బరి నూనె, నిమ్మరసం: ఒక కప్పులో కొద్దిగా కొబ్బరి నూనె (Coconut oil), కొద్దిగా నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి ఒక నిమిషం పాటు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు గోళ్లకు సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసే గోళ్లు విరగకుండా బలంగా పెరుగుతాయి.

click me!

Recommended Stories