వరస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు హీరోగా నటించిన ‘వన్.. నేనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్ . ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళుతోందీ బ్యూటీ.