వంటకు ఏ నూనె మంచిదో తెలుసా?

First Published | Jan 21, 2024, 9:52 AM IST

మనకు ఎన్నో రకాల వంట నూనెలో మార్కెట్ లో లభిస్తాయి. మీకు తెలుసా? మనం తింటున్న ఆహారమే మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు, కూరగాయల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ నూనె విషయంలో  మాత్రం తీసుకోరు. దీనివల్లే చాలా మంది తమకు తెలియకుండానే.. తమ ఆరోగ్యాన్ని పాడు చేసే నూనెలను వాడుతున్నారు. మరి వంట నూనె ఏది మంచిది? వంట నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

cooking oil

మనం ఏది తిన్నా దాని ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడే వాటినే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. మనం ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం విషయానికొస్తే మనలో ప్రతి ఒక్కరూ హెల్తీ పండ్లు, కూరగాయలను తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే ఇవే కాకుండా మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో వంట నూనె ఒకటి. వంటనూనె లేకుండా కూరలను చేయ్యం. కానీ చాలా మంది వంట నూనెల విషయంలో ఏ మాత్రం జాగ్రత్తగా ఉండరు. వంట నూనెనే కదా అని ఏది పడితే అది వాడుతుంటారు. కానీ  ఆరోగ్యానికి మేలు చేస్తుందా? చేయదా? అని తెలుసుకోకుండా వాడితే మాత్రం ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. 

వంటకు ఉపయోగించే నూనెలు మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అయినప్పటికీ.. చాలా మంది దీనిని పట్టించుకోరు. కానీ ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఏ వంట నూనె మంచిదో తెలుసుకోవాలి. అసలు ఏ వంట నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


నువ్వుల నూనె

నువ్వులే కాదు నువ్వుల నూనె కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం మీరు వంటకు తేలికపాటి, ముదురు నువ్వుల నూనె రెండింటినీ ఉపయోగించొచ్చు. డార్క్ నువ్వుల నూనెను సాస్లు, సలాడ్ల రుచిని పెంచడానికి ఉపయోగిస్తుంటారు.  ఇక లైట్ నువ్వుల నూనెను సాధారణంగా వేయించడానికి ఉపయోగిస్తారు.
 

గ్రేప్ సీడ్ ఆయిల్

ఆరోగ్యకరమైన వంట నూనెల జాబితాలో గ్రేప్ సీడ్ నూనె కూడా ఉంది. మనం ఈ నూనెను ఎన్నో వంటలకు ఉపయోగించొచ్చు. ఇది మల్టీపర్పస్ ఆయిల్. ఈ నూనెలో విటమిన్ ఇ,  పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. 
 

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, గుండెల్లో మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
 

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను ఒక్క జుట్టుకు మాత్రమే కాదు.. దీన్ని వంటల్లో కూడా వేయొచ్చు. ఈ నూనె చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ కలిగి ఉంటుంది. ఈ కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ.. జీవక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఫుడ్ కు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. 
 

అవిసె గింజల నూనె

అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఈ నూనెను వంటల్లో కూడా వాడొచ్చు.  ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలమైన అవిసె గింజల నూనెను చల్లగా ఉండే వంటల్లో ఉపయోగించాలి. ఇది వండిన తర్వాత దాని పోషక విలువలను పెంచడానికి సహాయపడుతుంది.

వాల్ నట్ ఆయిల్

వాల్ నట్ ఆయిల్ కూడా ఉత్తమ వంట నూనెకు గొప్ప ప్రత్యామ్నాయం. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్న వాట్ నట్ నూనెను తేలికపాటి రోస్టింగ్ లేదా సలాడ్ డ్రెస్సింగ్ కు ఉపయోగించొచ్చు. 
 

అవొకాడో ఆయిల్

ఆలివ్ ఆయిల్ మాదిరిగానే అవొకాడో ఆయిల్ కూడా మీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఎక్కువ మొత్తంలో మోనోశాచురేటెడ్ కొవ్వు, విటమిన్ ఇ లు ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని వివిధ మార్గాల్లో ఉపయోగించొచ్చు.
 

click me!