black coffee
మనలో చాలా మంది టీ లేదా కాఫీలను రోజూ తాగుతారు. కానీ వీటిపి క్రమం తప్పకుండా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. టీ, కాఫీలను ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చక్కెర, బెల్లం, పాలు, కెఫిన్ మొదలైనవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
టీ లేదా కాఫీని ఎక్కువగా తాగడం వల్ల మీ దంతాల ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. టీ లేదా కాఫీ మీ బట్టలపై పడితే మరకలు పడతాయి. ఇవి అంత సులువుగా పోవు. దంతాల విషయంలోనూ అంతే.. టీ, కాఫీల్లో దంతాలపై మచ్చలను కలిగించే పదార్థాలు ఉంటాయి. ఇది దంతాలపై మరిన్ని మచ్చలు పడేలా చేస్తుంది. టానిన్లు అని పిలువబడే సమ్మేళనం, పాలీఫెనాల్ ఒక రూపమే ఇది. ఇది నీటిలో విచ్ఛిన్నమవుతుంది. ఇది దంతాలపై మచ్చలను కలిగిస్తుంది. టానిన్లు దంతాలకు అంటుకోవడం వల్ల దంతాలకు పసుపు రంగు వస్తుంది.
టీ, కాఫీలను ఎక్కువగా తాగితే మీ నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది దంతాలు / ఎనామెల్ క్షయానికి దారితీస్తుంది. దీంతో కాలక్రమేణా మీ దంతాలు సన్నగా, మరింత పెళుసుగా మారుతాయి.
yellow teeth
దంతాలు పసుపు పచ్చగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1. టూత్ పేస్ట్ తో పళ్లు తోముకున్న తర్వాత కొద్దిగా ఉప్పు తీసుకుని పళ్లు తోముకోండి. దీని వల్ల మీ దంతాలు పసుపు రంగులోకి మారవు. అలాగే దంతాలపై మచ్చలు కూడా తొలగిపోతాయి.
yellow teeth
2. నారింజ తొక్క లేదా మామిడితో మీ దంతాలను శుభ్రపరచడానికి కూడా వాడొచ్చు. ఈ తొక్కలతో దంతాలను తోముకోవడం వల్ల మీ దంతాలపై మచ్చలు ఏర్పడవు.
yellow teeth
3. బేకింగ్ సోడా కూడా దంతాల పసుపు రంగును పోగొడుతుంది. అందుకే బేకింగ్ సోడాను తీసుకుని పేస్ట్ రూపంలో చేసి దీంతో మీ పళ్లను తోముకోండి. ఇది మీ దంతాలపై ఉన్న మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.