Land Of Toor Dal: మన దేశపు కందిపప్పు రాజధాని ఇదే, ఇక్కడ పప్పు రుచికి ఏదీ సాటిరాదు..!

Published : Nov 10, 2026, 10:51 AM IST

Land Of Toor Dal: వేడివేడి అన్నంలో పప్పు కలుపుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది. ఏ బిర్యానీ కూడా దీని ముందు సాటిరాదు. మరి, అలాంటి పప్పుకి మన దేశంలో రాజధాని ఎక్కడ ఉందో తెలుసా?

PREV
13
Land Of Toordal

మన దేశంలో ప్రతిరోజూ రెగ్యులర్ గా చేసే వంటల్లో పప్పు ముందు వరసలో ఉంటుంది. పప్పు లేకుండా.. ఇండియన్ భోజనం పూర్తి కాదు. పప్పుల్లో చాలా రకాలు ఉన్నా.. కందిపప్పు అందుల్లో రారాజు. అయితే... ఈ పప్పు.. మన వంటింట్లో అడుగుపెట్టడం వెనక.. పెద్ద చరిత్రే ఉంది. మన దేశంలో ఈ కందిపప్పు చాలా ప్రదేశాల్లో పండుతుంది. కానీ, ప్రత్యేకంగా.. దీనికంటూ ఓ రాజధాని ఉంది. ఇక్కడ పండే పప్పుకి ఉన్న రుచి.. మన దేశంలో మరెక్కడా దొరకదు. మరి, ఆ ప్లేస్ ఎక్కడ ఉంది? అక్కడ పండే పప్పుకి ఉన్న ప్రత్యేకత ఏంటి?

23
ల్యాండ్ ఆఫ్ కందిపప్పు ఏది..?

మన దేశంలో చాలా ప్రాంతాల్లో కందిపప్పు పండుతుంది. కానీ పప్పుకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నగరం ఒకటి ఉంది. అదే కర్ణాటక రాష్ట్రంలో కలబురగి. ఈ నగరాన్ని.. మన దేశంలో ల్యాండ్ ఆఫ్ టూర్ దాల్ అని పిలుస్తారు. మన దేశంలో ఎక్కువ శాతం కందిపప్పు పండించే నగరం ఇదే కావడం విశేషం..

కందిపప్పు నిలయం...కలబురగి...

ప్రస్తుతం కలబురగి గా ప్రత్యేక సంపాదించిన ఈ నగరాన్ని పూర్వం గుల్బర్గా అని పిలిచేవారు. ఈ నగరం మొత్తం కందిపప్పు విపరీతంగా పండిస్తారు. ఇక్కడ పండే కందిపప్పుని.. గుల్బరా తూర్ దాల్ అని కూడా పిలుస్తారు. ఈ పప్పు చాలా నాణ్యంగా ఉంటుంది. అందుకే.. దీనికి ప్రత్యేకంగా జీఐ ట్యాగ్ గుర్తింపు కూడా ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో కంది పంట సాగులో ఈ జిల్లా అగ్రస్థానంలో ఉండటంతో, ప్రభుత్వం కూడా కలబురగిని ‘ Toor Bowl’ అని పిలవడం మొదలుపెట్టారు.

33
ఇక్కడ పండే కందిపప్పు కి స్పెషాలిటీ ఏంటి?

సాధారణ కందిపప్పు కంటే కలబురగి కందిపప్పు రుచి, సువాసన, వండే విధానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఈ కందిపప్పు తేలికపాటి డ్రై ఫ్రూట్ రుచి కలిగి ఉంటుంది. వండినప్పుడు కూడా పప్పు చాలా మెత్తగా ఉంటుంది. క్రీమీగా మారుతుంది. అందుకే.. ఈ పప్పు చాలా రుచిగా కూడా ఉంటుంది. పప్పుకి అంత రుచి రావడానికి... అక్కడి భూములే కారణం. ఈ భూములకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ICRISAT) ప్రకారం, కలబురగి ప్రాంతంలోని నేలల్లో క్యాల్షియం, పొటాషియం ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వాతావరణం, మట్టి గుణాలే పప్పుకి ఆ ప్రత్యేకమైన సువాసనను, త్వరగా ఉడికే గుణాన్ని అందిస్తాయి. ఇక్కడ లభించే కందిపప్పుతో.. ఏ వంట చేసినా రుచి రెట్టింపు ఉంటుంది.

ఒక సామాన్యమైన దినుసు నగరం గుర్తింపుగా మారడం విశేషం. దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పండించే కందిపప్పు కలబురగి పేరును కర్ణాటక సరిహద్దులు దాటించి దేశవ్యాప్తంగా నిలిపింది. దేశవ్యాప్తంగా ఇక్కడ పండే పప్పుకి మంచి డిమాండ్ కూడా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories