
వీకెండ్ లో మీ ఫ్యామిలీ లేదా..ఫ్రెండ్స్ తో కలిసి మల్టీ ఫ్లెక్స్ కు వెళ్లి సినిమా చూడటం చాలా మందికి నచ్చుతుంది. కానీ, టికెట్ తీసుకొని లోపలికి వెళ్లిన తర్వాత రూ.80 నుంచి రూ.100 ఉండే వాటర్ బాటల్, రూ.400 ఉండే పాప్ కార్న్ ధరలు చూస్తే.. ఎవరి గుండె అయినా గుభేలుమంటుంది. టికెట్ కేవలం సినిమా చూడటానికి మాత్రమే, లోపల ఏది కొనాలన్నా.. భారీగా ఖర్చు చేయాల్సిందే. కానీ, వినియోగదారుల హక్కులు, చట్టపరమైన నిబంధనల ప్రకారం.. ప్రతి మల్టీప్లెక్స్ థియేటర్ లో ప్రేక్షకుల కోసం కొన్ని సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి. వాటి కోసం మీరు ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మరి, ఫ్రీగా లభించే సౌకర్యాలు ఏంటో చూద్దాం...
సినిమా హాల్ లోని.... మనం ఇంటి నుంచి వాటర్ తీసుకువెళ్లడానికి అనుమతించకపోవచ్చు. అయితే, మీరు అక్కడ డబ్బులు ఖర్చు చేసి వాటర్ బాటిల్ కొనాల్సిన అవసరం లేదు. ప్రతి మల్టీ ఫ్లెక్స్ తమ ప్రేక్షకులకు శుభ్రమైన, చల్లటి ఆర్వో వాటర్ ఉచితంగా అందించాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. థియేటర్ ప్రాంగణంలో ఉచిత వాటర్ కూలర్లు, డిస్పోజబుల్ గ్లాసులు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అక్కడ ఫ్రీగా వాటర్ కౌంటర్ లేకపోయినా,అవి పని చేయకపోయినా మీరు నేరుగా కౌంటర్ సిబ్బందినీ లేదా, మేనేజర్ ని అడగి ఫ్రీగా వాటర్ తాగొచ్చు. మీరు డబ్బులు పెట్టి.. వాటర్ కొనాల్సిన అవసరం లేదు.
2. చిన్నపిల్లల ఆహారం, పాలు
మీతో పాటు చిన్నపిల్లలు లేదా పసికందులు ఉన్నట్లయితే భద్రతా సిబ్బంది చెకింగ్ సమయంలో మీ పిల్లల ఆహారాన్ని అడ్డుకోలేరు. బేబీ మిల్క్ బాటిల్స్, సెరెలాక్ లేదా ఇంట్లో తయారు చేసిన ఉగ్గు/కిచిడీ వంటి తేలికపాటి ఆహారాన్ని థియేటర్ లోపలికి సులభంగా తీసుకెళ్లవచ్చు. అంతేకాదు, మీ బిడ్డ పాలు చల్లారిపోతే వాటిని వేడినీటిలో ఉంచి వేడి చేసి ఇవ్వమని క్యాంటీన్ సిబ్బందిని ఉచితంగా కోరవచ్చు.
మల్టీప్లెక్స్‌లలో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా దివ్యాంగుల కోసం ప్రత్యేక ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. థియేటర్ ఎంట్రెన్స్ వద్ద వీల్‌చైర్లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాకుండా, నడవలేని వారిని సురక్షితంగా వారి సీట్లలో కూర్చోబెట్టడం థియేటర్ సిబ్బంది బాధ్యత. ఈ సహాయానికి ఎలాంటి టిప్స్ లేదా అదనపు రుసుములు చెల్లించనవసరం లేదు.
4. ప్రథమ చికిత్స, అత్యవసర వైద్య సేవలు..
చీకటి హాలులో మెట్లు దిగుతున్నప్పుడు ప్రమాదవశాత్తు జారిపడినా, లేదా సినిమా చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా కళ్లు తిరగడం, తలనొప్పి, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా థియేటర్ యాజమాన్యం తక్షణమే ఉచితంగా ప్రథమ చికిత్స అందించాలి. ప్రతి థియేటర్‌లో ప్రథమ చికిత్స కిట్ అంటే..బ్యాండేజీలు, పెయిన్ కిల్లర్స్, ఓఆర్ఎస్, బీపీ మోనిటర్ తప్పనిసరిగా ఉంచాలి. అవసరమైతే ఉచితంగా గ్లూకోజ్ లేదా ORS నీటిని అందించడం వారి బాధ్యత.
5. ఉచిత మరుగుదొడ్లు, 3D కళ్లద్దాల నియమాలు
టికెట్ కొనుగోలు చేసిన వారు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా శుభ్రమైన వాష్‌రూమ్‌లను ఉపయోగించుకోవచ్చు. అలాగే, మీరు 3D సినిమా టికెట్ బుక్ చేసినప్పుడు, ఆ 3D ఛార్జీలు ఇప్పటికే టికెట్ ధరలో కలిసి ఉంటే, శానిటైజ్ చేసిన 3D కళ్లద్దాలను ఎలాంటి దాచిన రుసుములు లేకుండా పొందడం మీ హక్కు.
టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు థియేటర్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఉచిత సౌకర్యాలు, పార్కింగ్ నియమాలు తనిఖీ చేయండి. ప్రాంతీయ సినిమాటోగ్రాఫ్ నిబంధనలను బట్టి కొన్ని నియమాలు కొద్దిగా మారవచ్చు. ఏదైనా థియేటర్ యాజమాన్యం ఈ ఉచిత సౌకర్యాలను నిరాకరిస్తే, మీరు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH - National Consumer Helpline) లేదా స్థానిక వినియోగదారుల ఫోరమ్‌కి ఫిర్యాదు చేయవచ్చు.