జుట్టు రాలిపోవడం, పొడవుగా పెరగకపోవడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టు పెరుగుదలకు అత్యవసరమైన సమ్మేళనం బయోటిన్. దీన్ని విటమిన్ బి7 అని కూడా పిలుస్తారు. జుట్టు తయారీకి ప్రధానమైన ప్రోటీన్ కెరాటిన్. ఈ కెరాటిన్ నిర్మించే బాధ్యత బయోటిన్ దే. కాబట్టి మీరు బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించవచ్చు. పైగా బయోటిన్ ఉండే ఆహారాలన్నీ కూడా చాలా తక్కువ ధరకే లభిస్తాయి.
26
కోడిగుడ్లు
జుట్టుకు అద్భుతమైన ఆహారం అంటే కోడిగుడ్లే. దీనిలో బయోటిన్ తో పాటు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది. మీ జుట్టును పెంచే లక్షణం గుడ్లలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గుడ్లలోని పచ్చ సొనలో బయోటిన్ ఎక్కువ. ఇక తెలుపు రంగు సొనలో ప్రోటీన్ ఎక్కువ. కాబట్టి ఈ రెండింటినీ మీరు తినాల్సిన అవసరం ఉంది. అల్పాహారంలో ఉడికించిన కోడి గుడ్డును తింటే బయోటిన్ అధికంగా శరీరంలో చేరుతుంది.
36
బాదం పప్పులు
ప్రతిరోజు నానబెట్టిన బాదంపప్పులు ఒక ఐదు తినండి చాలు. నెల రోజుల్లోనే మీ జుట్టులో ఎంతో మార్పు కనిపిస్తుంది. బాదంపప్పులో బయోటిన్, విటమిన్ ఈ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి బలమైన జుట్టుతో పాటు మెరిసే వెంట్రుకలను అందిస్తాయి. గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులు మీ జుట్టును నెల రోజుల్లోనే మార్చేస్తాయి. జుట్టు రాలకుండా అడ్డుకుంటాయి. కాబట్టి బాదంపప్పును ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి.
శీతాకాలంలో దొరికే ఆహారాల్లో చిలగడదుంప ఒకటి. ఇది ఒక అద్భుతమైన ఆరోగ్యమైన చిరుతిండి అని చెప్పుకోవచ్చు. ఈ దుంపల్లో బయోటిన్, బీటా కెరాటిన్ అధికంగా ఉంటాయి. ఈ రెండు కూడా జుట్టుకు అవసరమైన పోషకాలే. క్రమం తప్పకుండా రోజుకు ఒక చిలగడ దుంప తినడం వల్ల మీ జుట్టులో ఎంతో మార్పును చూస్తారు. తలపై ఉన్న మాడు కూడా ఆరోగ్యంగా మారుతుంది. చిలగడ దుంపను సాయంత్రం స్నాక్ గా తిన్నా కూడా మంచిదే. దీన్ని ఉడకబెట్టుకొని తిన్నా, కాల్చి తిన్నా కూడా ఆరోగ్యంగా జుట్టు పెరుగుతుంది. ముఖ్యంగా చిలగడ దుంప ఉడకబెట్టుకున్నాక కాస్త నెయ్యిని జోడించి తింటే ఇంకా ఆరోగ్యం.
56
పాలకూర
పాలకూర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీనిలో ఉండే పోషకాలు బయోటిన్, ఐరన్, విటమిన్ సి వంటివి. ఇవన్నీ కూడా మనం శరీరానికి అవసరమైనవి. తలపై ఉన్న మాడుకు రక్తప్రసరణను పెంచడంలో పాలకూర సహకరిస్తుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు వేర్లకు ఆక్సిజన్ సరఫరా సవ్యంగా జరుగుతుంది. పాలకూరను వేపుడు రూపంలో లేదా పప్పులో కలుపుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూరలో, నిమ్మకాయ, ఉసిరికాయ వంటివి చేర్చి తింటే ఇంకా ఆరోగ్యం.
66
కొమ్ము శెనగలు
కొమ్ము శెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలు. ఇందులో ఇనుము అధికంగా ఉంటుంది. అలాగే బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్, జింక్ కూడా ఉంటుంది. కాబట్టి జుట్టు వేర్ల నుండి బలంగా మారుతుంది. మీ రోజు వారి ఆహారంలో కొమ్ము శెనగలను చేర్చుకోండి. కేవలం రెండు నుంచి మూడు వారాల్లోనే జుట్టు పెరుగుదలలో మీరు మార్పును చూస్తారు. ఇది శాఖాహారమే కాబట్టి కోడిగుడ్లు తినని వారికి కొమ్ము శెనగలు మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు.