Dosa Capital: మన దేశంలో స్పెషల్ గా దోశకు ఒక రాజధాని కూడా ఉందా?

Published : Oct 03, 2026, 05:43 PM IST

Dosa Capital: ప్రతిరోజూ మనం ఇంట్లో, బయట హోటల్స్ లో తినే దోశకు స్పెషల్ గా రాజధాని కూడా ఉందా? మన దేశంలో ఏ నగరాన్ని దోశకు రాజధానిగా పిలుస్తారో తెలుసా? ఈ నగరమే దోశకు ఎందుకు ఫేమస్..?

PREV
13
దోశ ఏ నగరానికి ఫేమస్..?

దక్షిణ భారత దేశంలో ఏ చిన్న హోటల్ కి వెళ్లినా కూడా మనకు ఈజీగా టేస్టీ దోశ దొరికేస్తుంది. రెగ్యులర్ గా ఇంట్లో దోశ చేసుకున్నా కూడా... హోటల్ కి వచ్చి కూడా మళ్లీ దోశ తినే వాళ్లు మనలో చాలా మంది ఉంటారు. దోశలో చాలా రకాలు కూడా ఉన్నాయి. పేపర్ దోశ నుంచి మసాలా దోశ వరకు చాలా రకాలు ఉన్నాయి. ఈ దోశలను మనం కొబ్బరి చట్నీ, కారం పొడి, టమాట చట్నీ, సాంబర్... దేనితో తిన్నా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే కాదు.. మనకు దోశ.. దేశంలో ఎక్కడైనా దొరికేస్తుంది. అయినా కూడా.. ఈ దోశకు స్పెషల్ గా ఒక రాజధాని కేటాయించారనే విషయం మీకు తెలుసా? అది మరేదో కాదు.. బెంగళూరు.

23
బెంగళూరు..దోశలకు ఎందుకు అంత ఫేమస్..?

కర్ణాటక రాజధాని బెంగళూరు అంటే సాధారణంగా టెక్ కంపెనీలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కేఫేలు గుర్తుకు వస్తాయి. కానీ.. ఫుడ్ లవర్స్ కి మాత్రం ముందుగా గుర్తువచ్చేది దోశ మాత్రమే.

కర్ణాటక రాజధాని బెంగళూరు అంటే సాధారణంగా టెక్ కంపెనీలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కేఫేలు గుర్తొస్తాయి. కానీ ఫుడ్ లవర్స్‌కి మాత్రం బెంగళూరు అంటే దోశ కూడా గుర్తొస్తుంది. ఈ బెంగళూరు సిటీలో.. పాతకాలం నాటి వెజిటేరియన్ హోటళ్ల దగ్గర నుంచి.. రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్ల వరకు ఇక్కడ దోశకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందు దోశ తినడం నుంచి.. సాయంత్రం స్నేహితులతో కలిసి టిఫిన్ సెంటర్ లో దోశ ఆర్డర్ చేయడం వరకు బెంగళూరు ఫుడ్ కల్చర్ లో.. దోశ ఒక భాగం అయిపోయిందని చెప్పొచ్చు.

బెంగళూరులో దొరికే దోశల రకాలు...

బెంగళూరులో దోశ తినాలంటే ఒకే రకంతో ఆగిపోవాల్సిన అవసరం లేదు. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఎన్నో రకాల దోశలు అందుబాటులో ఉంటాయి.

క్రిస్పీ పేపర్ దోశ, మసాలా దోశ ,సెట్ దోశ, బెన్నె దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, చీజ్ దోశ, పొడి దోశ

సాంప్రదాయ రుచులు ఇష్టపడేవారికే కాకుండా కొత్త ఫ్లేవర్స్ ట్రై చేయాలనుకునేవారికి కూడా బెంగళూరులో దోశ ఆప్షన్లు చాలానే ఉంటాయి.

33
బెంగళూరు దోశలో స్పెషాలిటీ ఏంటి?

బెంగళూరులో దోశ కేవలం బ్రేక్‌ఫాస్ట్ కాదు.. చాలామందికి అదొక ఎమోషన్. కర్ణాటక టిఫిన్ సంప్రదాయంలో దోశకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణ పదార్థాలతో తయారైనప్పటికీ.. సరైన ఫెర్మెంటేషన్, వెన్న, నెయ్యి, చట్నీలు, సాంబార్ కలిస్తే దోశ రుచి మరింత పెరుగుతుంది.

బెంగళూరు స్టైల్ దోశలో సాధారణంగా కనిపించే ప్రత్యేకతలు:

వెన్న, నెయ్యి వాడకం బాగా ఫెర్మెంట్ అయిన పిండి బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే టెక్చర్ రుచికరమైన ఆలూ మసాలా ప్రత్యేకమైన చట్నీలు, సాంబార్

వీటిలో బెన్నె దోశ చాలా ప్రత్యేకమైనది. 'బెన్నె' అంటే కన్నడలో వెన్న. పేరుకు తగ్గట్టుగానే ఈ దోశలో వెన్నను ఎక్కువగా ఉపయోగిస్తారు. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ దోశ.. కర్ణాటక వంటకాలలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

బెంగళూరులో తప్పకుండా ట్రై చేయాల్సిన దోశలు

మసాలా దోశ: పలుచగా, క్రిస్పీగా ఉండే దోశలో స్పైసీ ఆలూ మసాలా పెట్టి ఇస్తారు. చట్నీ, సాంబార్‌తో తింటే అదిరిపోయే రుచి.

బెన్నె దోశ: వెన్నతో తయారయ్యే కర్ణాటక స్పెషల్. సాధారణ దోశల కంటే రిచ్‌గా, ప్రత్యేకమైన రుచితో ఉంటుంది.

సెట్ దోశ: చిన్నగా, మెత్తగా ఉండే దోశలను సాధారణంగా మూడు కలిపి సర్వ్ చేస్తారు. వీటితో వెజిటబుల్ సాగు కూడా ఇస్తారు.

రవ్వ దోశ: రవ్వతో తయారయ్యే ఈ దోశ చాలా పలుచగా, క్రిస్పీగా ఉంటుంది. మసాలా ఫ్లేవర్‌తో మంచి టేస్ట్ వస్తుంది.

పొడి దోశ: దోశపై కారం పొడిని చల్లి.. నెయ్యి లేదా వెన్నతో తయారు చేస్తారు. స్పైసీ ఫుడ్ ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్.

Read more Photos on
click me!

Recommended Stories