Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఎప్పుడు? బంగారం కొనడానికి శుభ ముహూర్తం ఏది?

Published : Mar 29, 2026, 02:16 PM IST

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటలకు మొదలవుతుంది.  ఏప్రిల్ 20 ఉదయం 7:49 వరకు ఆ తిధి  ఉంటుంది. వైశాఖ శుక్ల తదియ రెండు రోజులూ వస్తుండటంతో ఈ పండుగ ఎప్పుడు చేయాలో, బంగారం ఎప్పుడు కొనాలో తెలుసుకోండి.

PREV
14
అక్షయ తృతీయ 2026 ఎప్పుడు?

అక్షయ తృతీయ పండుగ హిందూమతంలో ఎంతో ముఖ్యమైనది.  వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో ఈ పండుగలను నిర్వహించుకుంటారు. కాకపోతే ఈసారి తేదీపై కాస్త గందరగోళం ఉంది. కొందరు ఏప్రిల్ 19 అంటుంటే, మరికొందరు ఏప్రిల్ 20 అంటున్నారు. అసలు అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకోవాలి? పూజ ఎప్పుడు చేయాలి?  బంగారం కొనుగోలుకు సరైన సమయం ఏది? ఈ విషయాల గురించి తెలుసుకోండి. 

24
అక్షయ తృతీయ ఏప్రిల్ 19 లేదా 20?

సనాతన ధర్మంలో అక్షయ తృతీయ ఎంతో శుభప్రదమైన రోజు. ఈ రోజున చేసే పుణ్యకార్యాలు శాశ్వత ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున మీరు చేసే దానాలు, జపాలు, ప్రార్థనలు, పుణ్యస్నానాలు, హోమాలు  అన్నీ అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి.  వైశాఖ శుక్ల తదియ లేదా అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 19న ఉదయం 10:49 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 20న ఉదయం 7:49 గంటల వరకు ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఈ సంవత్సరం అక్షయ తృతీయ మధ్యాహ్నానికి ముందే ప్రారంభమవుతుంది. కాబట్టి ఏప్రిల్ 19 అంటే ఆదివారం రోజున అక్షయ తృతీయ నిర్వహించుకోవాలని శాస్త్రం చెబుతోంది.

34
ఏప్రిల్ 20న ఎందుకు కాదు?

ఏప్రిల్ 20 సోమవారం రోజున తదియ తిథి, రోహిణి నక్షత్రం కలిసి వస్తాయి.  ఆ రోజే అక్షయ తృతీయ చేసుకోవాలని కొందరి వాదన. కానీ, ఆ రోజు ఉదయం 7:27 గంటలకే తదియ తిథి ముగిసిపోతుంది. మధ్యాహ్న శుభ సమయం లేదా ప్రదోష కాలం ఉండదు. అందుకే ఆ రోజు పండుగ నిర్వహించుకోవడం సరైనది కాదు.

ఏప్రిల్ 19న అక్షయ తృతీయ పూజకు శుభ సమయం ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు మంచిది.  ఈ సమయంలో పూజ చేస్తే, మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి

44
బంగారం కొనడానికి మంచి ముహూర్తం

అక్షయ తృతీయ రోజున బంగారం కొనేందుకు శుభముహూర్తం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏప్రిల్ 19న, తదియ తిథి ఉదయం 10:49 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయం నుంచి మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇది మీకు ఎంతో కలిసి వస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories