
ప్రతి వ్యక్తి ఆహారపు అలవాట్లు వేర్వేరుగా ఉన్నట్టే.. వారి జీర్ణక్రియ, bowel movement భిన్నంగా ఉంటుంది. కొందరు ఉదయాన్నే కడుపు ఖాళీ చేసి ఫ్రీ అయితే.. మరికొందరు రోజుకు రెండు లేదా మూడు సార్లు వాష్‌రూమ్‌కు వెళతారు. ఇక మరికొంతమందిలో మోషన్ అంత ఫ్రీగా ఉండదు. ప్రతీరోజూ ఇబ్బంది పడుతుంటారు. వీరికి మోషన్ రావడం అంటే డెలివరీ అంత కష్టంగా మారుతుంది. దీనిని మలబద్ధకం అని పిలుస్తారు.
మలబద్ధకం సాధారణ జీర్ణ సమస్య. కొందరికి ఇది మామూలు విషయం అయితే మరికొందరికి ఎప్పుడో ఒకప్పుడు డీల్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, నిండుగా అనిపిస్తుంది. అసౌకర్యంగా ఉంటుంది. ఈ టైంలో చేయాల్సిందల్లా.. ఒకదగ్గర కూర్చుని ఉండడం. కడుపులో ఇబ్బంది తగ్గేవరకు కదలకపోవడం.
అయితే, మలబద్దకం అంత భయపడాల్సిన విషయం కాదు. ఆహారంలో ఫైబర్ కంటెంట్ ను పెంచడం, నీరు ఎక్కువగా తాగడం వల్ల దాన్నుంచి బయట పడొచ్చు. అయితే రెగ్యులర్ గా Constipation గురవుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సహాయం అవసరం అవుతుంది కూడా.. అసలు మలబద్ధకం ఎందుకు వస్తుంది? ఎలాంటి లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలి? లాంటి సమాచారం తెలిసి ఉంటే మంచిది.
మలబద్ధకం ఎందుకు వస్తుంది...
digestion ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది, ఇందులో అనేక అవయవాలు ఉంటాయి. మనం ఆహారం తిన్నప్పుడు, పోషకాలు కణాల ద్వారా శోషించబడతాయి. వ్యర్థ పదార్థాలు శరీరం నుండి బయటకు వెళ్లడానికి ముందు అది అనేక అవయవాల గుండా వెళుతుంది. ఆహారం పెద్దప్రేగుకు చేరినప్పుడు మాత్రమే నీరు, గ్లూకోజ్ శోషించబడతాయి. మలం వేరు చేయబడుతుంది. అంటే పెద్దప్రేగులో మలం నిల్వ చేయబడుతుంది.
మలబద్ధకం విషయంలో, మీ జీర్ణవ్యవస్థ చివరిలో ఉన్న సిగ్మోయిడ్ కోలన్‌లో మలం పేరుకుపోతుంది. ఇది ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీనివల్ల మీకు కడుపు నిండుగా ఉన్నట్టు, ఉబ్బిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ సమయంలో శరీరం దాన్నుంచి మొత్తం నీటిని పీల్చేస్తుంది. దీంతో మలాన్ని విసర్జించడం కష్టంగా, డ్రై గా మారి ఇబ్బంది తీవ్రమవుతుంది.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి రకరకాల పానీయాలు, మందులు వాడుతుంటారు. అయితే, పరిస్థితి తీవ్రంగా మారకముందే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. మలబద్ధకం తరచుగా పెద్దప్రేగులో తీవ్రమైన సమస్యలకు దారి తీయచ్చు.
పొత్తి కడుపు నొప్పి
మలబద్ధకం మీకు అసౌకర్యంగా, ఉబ్బరంగా ఉన్నట్టుగా అనిపించేలా చేస్తుంది. కానీ ఈ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారితే.., కడుపునొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మలబద్ధకం తీవ్రంగా ఉన్నప్పుడు, పేగులో అసౌకర్యం ఏర్పడి, చిరిగిపోవడానికి, ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. పొత్తికడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటే..వెంటనే చికిత్స చేయాలి.
మలంలో రక్తం
మలం విసర్జించేటప్పుడు రక్తం పడుతుంది. ఈ పరిస్థితి కూడా సాధారణమైనది కాదు. టాయిలెట్ కు వెళ్లినప్పుడు మోషన్ లో రక్తం పడుతుండడం గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. హేమోరాయిడ్స్, inflammatory bowel disease (IBD) లేదా colorectal cancer వంటి అనేక కారణాల వల్ల ఇది జరగవచ్చు.
వారంలో రెండు,మూడు సార్లు...
కొంతమంది రోజూ మోషన్ వెళ్లరు. రెండు రోజులకొకసారి అలా వెడుతుంటారు. అయితే వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు మోషన్ పోనట్లైతే మలబద్ధకంతో బాధపడుతున్నట్లు పరిగణించబడుతుంది. ఇక వారం పాటు మలవిసర్జన జరగలేదంటే.. అది చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించబడుతుంది. తప్పనిసరి వైద్యసహాయంతోనే మీ సమస్య తీరుతుంది.
మలబద్దకం విషయంలో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన ఇంకొన్ని పరిస్థితులు ...
మలబద్దకంతో పాటు...
- అపస్మారక స్థితి
- శ్వాస సమస్యలు
- తీవ్ర జ్వరం
- హృదయ స్పందన వేగంగా మారడం
- వాంతులు అవ్వడం