కరోనా వైరస్ బారిన పడకూడదంటే ఈ ఆహారాలను తప్పకుండా తినాల్సిందే..!

Published : Dec 30, 2022, 12:03 PM ISTUpdated : Dec 30, 2022, 12:39 PM IST

కోవిడ్ -19 కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిబారిన పడకూడదన్నా.. దీన్ని నుంచి తొందరగా బయటపడాలన్నా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తప్పకుండా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే..   

PREV
19
 కరోనా వైరస్ బారిన పడకూడదంటే ఈ ఆహారాలను తప్పకుండా తినాల్సిందే..!

కోవిడ్ -19 కొత్త వేరియంట్ వ్యాప్తి ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ కరోనా వైరస్ బారిన పడకూడదంటే బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉండాలి. అయితే కొన్ని రకాల ఆహారాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడతాయి. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల వైరస్ లు, ఇతర అంటు వ్యాధులతో పోరాడటానికి శక్తి అందుతుంది.  నిజానికి చలికాలంలో మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనికి తోడు నిశ్చల జీవనశైలి కూడా ఇమ్యూనిటీ పవర్ ను దెబ్బతీస్తుంది. అయితే వైరస్ తో పోరాడటానికి ఎలాంటి ఆహారాలు తోడ్పడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

29
fruits

ప్రతిరోజూ పండ్లను తినండి

పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి. ఇందుకోసం జామ, ఆపిల్, అరటి, స్ట్రాబెర్రీ, కాంటాలౌప్ పుచ్చకాయ, ద్రాక్షపండు, పైనాపిల్, బొప్పాయి, నారింజ వంటి పండ్లను క్రమం తప్పకుండా తినండి. ప్రతిరోజూ రెండు కప్పుల పండ్లను నాలుగు పూటలా తినండని నిపుణులు సలహానిస్తున్నారు. 
 

39
vegetables

తాజా కూరగాయలు

చలికాలంలో తాజా కూరగాయలను తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. ముఖ్యంగా సీజనల్ కూరగాయలను మిస్ కాకుండా తినాలి. అందులో ఆకు కూరలను ఎక్కువగా తినాలి. బ్రోకలీ, బచ్చలికూర, మెంతి, మునగాకు వంటి కూరగాయలను రోజూ తినండి. అలాగే గ్రీన్ బెల్ పెప్పర్స్, కొత్తిమీర,ఇతర తాజా కూరగాయలను తింటే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. సుమారు 2.5 కప్పుల కూరగాయలను తీసుకోండి. 
 

49

ధాన్యాలు, గింజలను తినండి

సమతుల్య ఆహారంలో ఆరోగ్యకరమైన ధాన్యాలు మంచి మొత్తంలో ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రాసెస్ చేయని మొక్కజొన్న, ఓట్స్, గోధుమ, చిరుధాన్యాలు, బ్రౌన్ రైస్, బంగాళాదుంప వంటివి రోజుకు 180 గ్రాముల ధాన్యాలను తినండి. ప్రతిరోజూ బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ను గుప్పెడు తినండి.
 

59

రెడ్ మీట్

రెడ్ మీట్ ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు తినొచ్చు. అలాగే పౌల్ట్రీని వారానికి 2 నుంచి 3 సార్లు తినొచ్చు. చేపలు, గుడ్లు,  పాలు వంటి ఆహారాలను తినండి. ఇవి మీ రోగనిరోధక  శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 
 

69
fruits and vegetables

ఆరోగ్యకరమైన స్నాక్స్ కు మారండి

కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే వేయించిన ఆహారాలు, ప్యాకేజ్డ్ స్నాక్స్, కుకీలు ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తాయి. వీటిని తినడం వల్ల ఒంట్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. అలాగే బీపీ కూడా బాగా పెరుగుతుంది. వీటికి బదులుగా హెల్తీ స్నాక్స్ గా తాజా పండ్లను, ముడి కూరగాయలను తినండి. 
 

79

అతిగా ఉడికించకండి

కూరగాయలను ఎక్కువగా ఉడికించడం వల్ల వాటిలో పోషకాలు తగ్గుతాయి. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు తగ్గుతాయి. అందుకే కూరగాయలను మరీ ఎక్కువగా ఉడికించండి. 2 నిమిషాలకు కనీసం 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వండేలా చూసుకోండని నిపుణులు చెబుతున్నారు. 
 

89


 ఉప్పు, కొవ్వును తక్కువగా తీసుకోండి

రోజుకు ఐదు గ్రాముల వరకు మాత్రమే ఉప్పును ఉపయోగించాలని నిపుణులు సలహానిస్తున్నారు. వెన్న, కొవ్వు మాంసం, కొబ్బరి, పామాయిల్స్, జున్ను, నెయ్యి,  క్రీమ్ లల్లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తక్కువగా తీసుకోండి. వీటికి బదులుగా అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే అవోకాడో, చేపలు, కాయలు, సోయా, ఆలివ్ ఆయిల్, మొక్కజొన్న నూనె, పొద్దుతిరుగుడు నూనెను తీసుకోండి. 
 

99

హైడ్రేట్ గా ఉంచుకోండి

ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలన్న నియమాన్ని పెట్టుకోండి. నీరు రక్తంలో పోషకాలను రవాణా చేయడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని విషాన్ని బయటకు పంపుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అంతేకాదు చక్కెర ఎక్కువగా ఉండే  కార్బోనేటేడ్, ఫిజీ పానీయాలకు దూరంగా ఉండండి. 
 

Read more Photos on
click me!

Recommended Stories