హైబీపీ: సాధారణంగా రక్తపోటు ఎంత ఉండాలి? ఎంత ఉంటే ప్రమాదం?

Published : Oct 23, 2025, 04:29 PM IST

High Blood Pressure: అధిక రక్తపోటు ఎంతో ప్రమాదకరం. కానీ చాలా మందికి రక్తపోటు ఎంత ఉండాలో కూడా తెలియదు. సాధారణంగా రక్తపోటు ఎంత ఉండాలి? ఎంత ఉంటే ఆరోగ్యకరం వంటివి విషయాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
సైలెంట్ కిల్లర్.. హైబీపీ

ప్రమాదకరమైన వ్యాధి అధిక రక్తపోటు (High Blood Pressure). రక్తపోటు ఎక్కువైనా, తక్కువైనా కూడా ప్రమాదమే. ఇది ఎలాంటి లక్షణాలు చూపించకుండా పెరిగిపోతుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. గుండె రక్తాన్ని ధమనుల ద్వారా పంపించే శక్తినే రక్తపోటు అంటారు. దీన్ని కొలిచినప్పుడు రెండు రీడింగులు వస్తాయి. ఒకటి సిస్టోలిక్, రెండోది డయాస్టోలిక్. సిస్టోలిక్ అంటే పైన ఉండే రీడింగ్. డయాస్టోలిక్ అంటే కింద ఉండే రీడింగ్.

25
సాధారణ రీడింగ్ ఇది

ఆరోగ్యకరమైన మనిషి రక్తపోటు 120/80 mm Hg కంటే తక్కువగా ఉండాలి. 120–129 /80 కన్నా ఎక్కువ ఉంటే ఎలివేటెడ్ రక్తపోటు అంటారు. ఇక స్టేజ్ 1 హైపర్‌టెన్షన్ ఉంటే 130–139 / 80–89 గా రీడింగు ఉంటుంది.ఒక స్టేజ్ 2 హైపర్ టెన్షన్ ఉంటే 140 కన్నా ఎక్కువ సిస్టోలిక్, 90 కన్నా ఎక్కువ డయాస్టోలిక్ ఉంటే వారికి హైబీపీ ఉన్నట్టే. అలాగే, 90/60 mm Hg కంటే తక్కువైతే తక్కువ రక్తపోటు (Hypotension) అంటారు.

35
లక్షణాలు ఉండవు

రక్తపోటు అధికంగా పెరిగినా కూడా చాలా మందికి ఎలాంటి సంకేతాలు కనిపించవు. కానీ ఎక్కువ కాలం పాటూ ఇది ధమనులను, గుండెను, కిడ్నీలను, మెదడును దెబ్బతీస్తుంది. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వైఫల్యం, మతిమరుపు, దృష్టి లోపం వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. అధికరక్తపోటు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

45
హైబీపీ ఉంటే ఈ పని చేయండి

హైబీపీ ఉన్నవారు ఉప్పును తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా తినకూడదు. అందులో కూడా సోడియం అధికంగా ఉంటుంది. ఆల్కహాల్ తాగడం వల్ల కూడా హైబీపీ పెరిగిపోతుంది. మీరు హైబీపీకి మందులు వాడుతున్నా, సరైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం కొనసాగించాలి. బరువు అధికంగా ఉంటే తగ్గించుకోవాలి. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఆహారం తినాలి. పొటాషియం ఉన్న ఆహారం తీసుకోవడం, ధూమపానం మానేయడం, సరిపడా నిద్ర పోవడం, ఒత్తిడి లేకుండా జీవించడం, పంచదార వాడకం తగ్గించడం వంటివి చేయాలి.

55
ఇంట్లో రక్తపోటు కొలవడం

ఇంట్లోనే మీరు రక్తపోటును కొలిచేందుకు అప్పర్ ఆర్మ్ కఫ్ మానిటర్ వాడాలి. కొలిచే ముందు అయిదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి. రెండు సార్లు రీడింగులు తీసుకుని వాటి సగటును పరిగణనలోకి తీసుకోవాలి. రీడింగ్ 180/120 mm Hg కంటే ఎక్కువగా ఉన్నా.. దానితో పాటూ ఛాతీ నొప్పి లేదా తిమ్మిరి ఉంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. రక్తపోటు నియంత్రణలో ఉంచే మందులు వాడడంతో పాటూ, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కూడా అవసరం. అలాగే రక్తపోటు క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories