Heart Attack: అసలేంటీ ట్రాన్స్ ఫ్యాట్.. ఇది గుండెపోటు ప్రమాదాన్ని ఎందుకు పెంచుతుంది..?

Published : Jun 20, 2022, 10:47 AM ISTUpdated : Jun 20, 2022, 10:50 AM IST

Heart Attack: ఒకప్పుడు వయసు మీద పడుతున్న వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు అన్ని వయసుల వారు దీని బారిన పడుతున్నారు.  దీనికి గల కారణాల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఒకటి. ఈ ట్రాన్స్ ఫ్యాట్ వల్ల గుండెపోటు ప్రమాదం ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

PREV
15
Heart Attack: అసలేంటీ ట్రాన్స్ ఫ్యాట్.. ఇది గుండెపోటు ప్రమాదాన్ని ఎందుకు పెంచుతుంది..?

ఆయిలీ ఫుడ్స్ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.. వీటిని తినే  అలవాటును వీలైనంత తొందరగా మానుకోవాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు తరచుగా చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఇది మన శరీరంలో  చెడు కొలెస్ట్రాల్ స్థాయిని విపరీతంగా పెంచుతుంది.  కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే గుండెపోటు (Heart attack), స్ట్రోక్ (stroke), డయాబెటిస్ (diabetes), రక్తపోటు (Blood pressure)ప్రమాదం పెరుగుతుంది. 

25

దీనికి ప్రధాన కారణం ట్రాన్స్ ఫ్యాట్. అవును ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans fats) ముఖ్యంగా హైడ్రోజనేషన్ ద్వారా తయారవుతాయి. ఇది మన శరీరానికి చాలా హానికరం. ఎందుకంటే ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి (Cholesterol level)లను పెంచుతుంది. అలాగే ధమనులకు మార్గాన్ని మూసివేస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడం (Blood clots), గుండెపోటు, స్ట్రోక్ ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంతకీ ట్రాన్స్ ఫాట్ అంటే ఏమిటీ, దీనివల్ల గుండె ఏ విధంగా ప్రభావితం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

35

ట్రాన్స్ ఫ్యాట్ (Trans fat) అంటే ఏమిటి?

ట్రాన్స్ ఫ్యాట్ అనేది కూరగాయల నూనెల నుంచి ఉత్పత్తి చేయబడే అసంతృప్త కొవ్వులు (Unsaturated fats). వీటిని జిడ్డుగల ఆహారాలలో ఉపయోగిస్తారు. సాధారణంగా ఫాస్ట్ ఫుడ్ లో ట్రాన్స్ ఫ్యాట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సహజమైనది. మరోటి కృత్రిమమైనది. కృత్రిమ ట్రాన్స్ ఫ్యాట్స్ ఒక రసాయన ప్రక్రియ ద్వారా హైడ్రోజనేషన్ ద్వారా సృష్టించబడతాయి. సహజంగా సంభవించే ట్రాన్స్ ఫ్యాట్స్ లో పాలు, మాంసం, జంతు ఉత్పత్తులు ఉంటాయి.
 

45

వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి.. 


కేకులు, కుకీలు, పైస్ వంటి బేకరీ ఫుడ్స్ లో ఉంటాయి. అలాగే  మైక్రోవేవ్ పాప్ కార్న్, Frozen pizza, Refrigerated flour వంటి  బిస్కెట్లు, రోల్స్ వంటి వాటిలో ఉంటాయి. అలాగే  ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్, ఫ్రైడ్ చికెన్ వంటి వేయించిన ఆహారాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. నాన్ డైరీ ఉత్పత్తుల్లో కూడా ఉంటుంది.

55
stroke

ట్రాన్స్ ఫ్యాట్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది:  ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ స్థాయిలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇవి LDL కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. HDL (మంచి)   కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. క్లియర్ గా చెప్పాలంటే ..  ట్రాన్స్ ఫ్యాట్ చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు ట్రాన్స్ ఫ్యాట్ వల్ల పేగుల్లో వాపు, రక్తం గడ్డకట్టడం, ముద్దలు ఏర్పడటం, కార్డియోవాస్క్యులర్ రిస్క్ వంటి ప్రమాదలన్నీ ఎదురవుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories