Male fertility: తండ్రులు కావడానికి సరైన వయసు ఇదే..!

First Published Jun 20, 2022, 10:10 AM IST

Male fertility: ఈ మధ్యకాలంలో చాలా మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో వయసు కూడా ఒకటి అంటోంది ఓ అధ్యయనం. పిల్లలు కావడానికి కూడా సరైన వయసు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

పిల్లల్ని కనడానికి వయసుతో అసలు సంబంధమే లేదంటుంటారు కొంతమంది పురుషులు. పిల్లల్ని కనే తల్లులకు మాత్రమే మాత్రమే జీవ గడియారం (Biological clock) ముఖ్యం. అయినప్పటికీ.. స్పెర్మ్ సంఖ్య (Sperm count), నాణ్యత (Quality)వయసుతో పాటుగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 20 ఏండ్లు దాటిన తర్వాతి నుంచి 30  ఏండ్ల వరకు స్పెర్మ్ కౌంట్ బాగుంటుందని.. ఈ వయసులోనే తండ్రులు కావడానికి సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. 

FERTILITY

50 ఏండ్ల లేదా అంతకంటె ఎక్కువ వయసున్న పురుషులు తండ్రులు కావడం సాధ్యమే. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఒక వ్యక్తి 92 ఏండ్ల వయసులో కూడా తండ్రి అయ్యాడు. అయినప్పటికీ.. పురుషుల వయసు ..గర్భం దాల్చే అయ్యే అవకాశాలను ప్రభావితం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు తండ్రులు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. 

పురుషులు సాధారణంగా స్పెర్మ్ ఉత్పత్తి (Sperm production)ని ఆపలేరు. కానీ మహిళల మాదిరిగా వారికి 'Biological Clock' లేదని దీని అర్థం కాదు. ఒక వ్యక్తి వయస్సులో.. అతని స్పెర్మ్ జన్యు ఉత్పరివర్తనాలకు లోనవుతుంది. ఇది అతని స్పెర్మ్  DNA ను దెబ్బతినే సంభావ్యతను పెంచుతుంది. ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అతని వయసు పిల్లల ఆరోగ్యంపై Potential effects ను కూడా సృష్టిస్తుంది.
 

'Advanced paternal age' ఉన్న తండ్రులు Neurodevelopmental Disorders ఉన్న పిల్లలను కనే  అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2010 లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం..  40 ఏళ్లు పైబడిన పురుషుల సంతానాన్ని.. ఇతర సంతానంతో పోలిస్తే Autism Spectrum Disorder అభివృద్ధి చెందే ప్రమాదం ఐదు రెట్లు ఉందని కనుగొన్నారు.

పురుషులు సాధారణంగా స్పెర్మ్ ఉత్పత్తిని ఎప్పుడూ ఆపరు. కానీ వయస్సుతో స్పెర్మ్ నాణ్యత క్షీణిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. Semen parameters పై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కు బెంచ్ మార్క్ లు. వీటిలో కౌంట్, మార్ఫాలజీ (Shape),చలనశీలత (Motion) ఉన్నాయి. 35 సంవత్సరాల వయస్సు నుంచి పురుషుల Semen parameters అధ్వాన్నంగా ఉంటాయని తెలిపింది. 
 

sperm

ఏ తండ్రులు కావడానికి ఏది  చిన్న వయసు

Journal of Epidemiology & Community Health లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం..  25 సంవత్సరాల కంటే ముందే తండ్రి కావడం తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుంది. అలాగే మధ్య వయస్సులో అకాల మరణానికి కూడా దారితీస్తుందని కనుగొన్నారు. 30 నుంచి 44 సంవత్సరాల వయస్సు వరకు పితృత్వాన్ని ఆలస్యం చేసిన వారి కంటే చిన్నతనంలోనే తండ్రులుగా మారిన పురుషులు పేలవమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని..అలాగే చిన్న వయస్సులోనే మరణించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. అంతేకాదు వీరిలో మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమస్యలన్నీ కేవలం యుక్తవయస్సులో పిల్లల్ని కనడం వల్లే వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. 

sperm

మీకు చాలా కాలంగా పిల్లలు కానట్టైతే .. తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. మీకు గాని మీ భార్యకు కూడా వంధ్యత్వం సమస్య ఉందా? లేదా? అని క్లారిటీగా తెలుసుకోవాలి. అందుకోసం అవసరమైన టెస్ట్ లు చేయించుకోవాలి. 

sperm

ఇందుకోసం శారీరక పరీక్షలు చేయించుకోవాలి. శారీరక పరీక్షలో వృషణాలను (Testicles) పరీక్షించాలి. డాక్టర్ వృషణానికి పైన ఉండే సిరల అసాధారణ నిర్మాణాల కొరకు వెరికోసెల్స్, వెరికోసెల్స్ ని చూస్తాడు.

sperm

స్పెర్మ్, వీర్య విశ్లేషణను కూడా పొందవచ్చు, దీనిలో నిపుణుడు మీ స్పెర్మ్ కౌంట్, వాటి ఆకారం, కదలిక, ఇతర లక్షణాలను పరీక్షిస్తాడు. 

sperm

Optimal semen ఉత్పత్తి చేయడానికి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. మీరో ఓవర్ వెయిట్ ఉంటే.. ఖచ్చితంగా బరువు తగ్గాల్సి ఉంటుంది. ఎందుకంటే బరువు తగ్గితేనే పిల్లల్ని కనే అవకాశం సులభమవుతుంది.  యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం కూడా స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మీ స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి మద్యం (Alcohol), ధూమపానం (Smoking)అలవాట్లను తగ్గించుకోవాలి. రెండింటిని పూర్తిగా వదిలేస్తేనే మీరు తొందరగా తండ్రి అవుతారు. అలాగే Groins ను చల్లగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీ వృషణాలు మీ శరీరంలోని మిగిలిన భాగాల కంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడే ఉత్తమ స్పెర్మ్ ను తయారు చేస్తాయి.అలాగే  బిగుతుగా ఉండే దుస్తులను ధరించకూడదు.  ల్యాప్ టాప్ ని మీ ఒడిలో ఎక్కువసేపు ఉంచడం, వేడి వాతావరణంలో ఎక్కువ సమయం గడపడం లేదా ఎక్కువ సేపు కూర్చోవడం వంటివి చేయకూడదు. 

click me!