కలలో దానిమ్మ పండు కనిపిస్తే లక్ష్మిదేవి రాబోతున్నట్టా.. నిపుణులు ఏం చెప్తున్నారు?

Navya G   | Asianet News
Published : Jan 29, 2022, 04:22 PM IST

నిద్రలో ఉన్నప్పుడు కలలు (Dreams) వస్తుంటాయి. కలలు వచ్చినప్పుడు అనేక వస్తువులు కనిపిస్తూంటాయి. మనిషికి వచ్చే కలలను బట్టి రానున్న సంఘటనలను అంచనా వేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఇలా కలలో కనిపించే వస్తువులను బట్టి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ముందునే అంచనా వేయవచ్చు. ప్రతి కలకి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మనం కలలో కనిపించే వస్తువులను బట్టి ఫలితాలు (Results) ఎలా ఉంటాయో తెలుసుకుందాం..  

PREV
17
కలలో దానిమ్మ పండు కనిపిస్తే లక్ష్మిదేవి రాబోతున్నట్టా.. నిపుణులు ఏం చెప్తున్నారు?

శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు (Objects) కలలో కనిపిస్తే శుభఫలితాలను అందించడంతో పాటు ఆరోగ్యానికి (Health) కూడా మంచిదని భావిస్తారు. కనిపించే ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. ఈ కలలు రానున్న భవిష్యత్తులోని మార్పులను తెలియజేస్తాయి.
 

27

కలలో డబ్బులు కనిపిస్తే మీకు త్వరలో భారీ ధన లాభం కలుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. అలాగే వ్యాపారానికి (Business) సంబంధించిన కలలు వస్తే కూడా భారీ ధనలాభం కలుగుతుంది. కలలో దానిమ్మ (Pomegranate) పండ్లు తింటున్నట్టు లేదా దానిమ్మ వ్యాపారం చేస్తున్నట్టు కనిపిస్తే ఆర్థికస్థితి మెరుగుపడుతుందట.
 

37

దానిమ్మ పండ్లు ఆర్థిక లాభానికి చిహ్నంగా భావిస్తారు. కలలో పచ్చని వాతావరణం, రైతులు కనిపిస్తే వ్యాపారంలో లాభాలకు సంకేతంగా పరిగణిస్తారు. పచ్చని వాతావరణాన్ని లక్ష్మీదేవికి సంకేతంగా భావిస్తారు. కలలో వంట (Cooking) చేసినట్టు లేదా అగ్ని (Fire) కనిపిస్తే శుభ సూచకంగా భావిస్తారు.
 

47

ఇవి కనిపిస్తే ఉపాధి కలగడం లేదా ఉద్యోగంలో పురోగతిని పొందుతారు. కనుక ఇవి రెండు కలలో కనిపిస్తే మంచిది. కలలో నిచ్చెన (Ladder) ఎక్కినట్లు కనిపిస్తే వ్యాపారంలో ఆర్థికంగా (Financially) మెరుగుపడతారు. ఇలాంటి కలలు వస్తే భవిష్యత్తులో మీరు లాభదాయకమైన పనులు కలుగుతాయి.   
 

57

కలలో గుర్రపుస్వారీ (Horseback riding) చేసినట్టు కనిపిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది అని అర్థం. ఇలాంటి కల వస్తే శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఉద్యోగ పరంగా మంచి స్థాయిలో ఉంటారు. అలాగే కలలో ఏనుగు (Elephant) కనిపించిన మంచిదే. కలలో గుర్రం, ఏనుగు కనిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండి త్వరలో మీ చేతికి డబ్బులు అందుతాయి.
 

67

కలలు పసుపు, ఎరుపు రంగులు కనిపిస్తే మీ ప్రతిష్ట (Prestige) పెరుగుతుంది. పసుపును బంగారానికి చిహ్నంగా భావిస్తారు. అలాగే ఇది రాచరికానికి సూచన. కనుక పసుపు కలలో కనిపిస్తే విలువైన వస్తువులను మీరు పొందగలుగుతారు. కలలో తృణధాన్యాల కుప్ప కనిపిస్తే ఆరోగ్యం (Health) కలుగుతుంది. అదేవిధంగా 8 సంఖ్య కనిపిస్తే సంపద, శారీరక ప్రయోజనాలు కలుగుతాయి.
 

77

ఎనిమిది సంఖ్యను జ్యోతిష్యం ప్రకారం అదృష్టంగా (Good luck) భావిస్తారు. అలాగే కలలో రాజభవనం, పెద్ద ఇంటి సందర్శనం కనిపిస్తే మంచి సంకేతంగా భావిస్తారు. భవిష్యత్తులో ధనలాభం పొందగలుగుతారు. అలాగే కలలో పాలు, పెరుగు, తేనె కనిపిస్తే మంచిదని శాస్త్రం చెబుతోంది. భవిష్యత్తులో అన్ని పనులలోను విజయాలు (Achievements) పొందగలుగుతారు.

click me!

Recommended Stories