Arthritis:కీళ్ల నొప్పులతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి చలికాలంలో ఈ నొప్పులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారికి కీళ్లు వాపు , నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నొప్పి లేదా వాపు వారి పరిస్థితులను బట్టి అది రుమటాయిడ్ ఆర్ధరైటిస్ లేదా ఆస్టియో ఆర్ధరైటిసో వైద్యులు నిర్ధారిస్తారు. అయితే ఈ రెండింటి లక్షణాలు కూడా ఒకేలా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యలు రావడానికి అసలైన కారణాలు తెలియలేదు కానీ.. ఆహారం కూడా దీనిపై ప్రభావంల చూపిస్తుందని కొంతమంది వైద్యులు విశ్వసిస్తున్నారు. అంటే నొప్పి తీవ్రమవడం, వాపు రావడం వంటివన్న మాట. కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే కీళ్ల వాపు, నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.