Health Tips: ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆయుర్వేద చిట్కాలివిగో..

Published : Jan 29, 2022, 03:09 PM IST

Omicron: కరోనా రోజురోజుకు విపరీతంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.

PREV
16
Health Tips: ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆయుర్వేద చిట్కాలివిగో..

Omicron: దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి బారిని పడినవారు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 3 లక్షలకు పైగా ఉన్నారు. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ఒకరి నుంచి మరొకరి వేగంగా వ్యాపిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ కరోనా టీకాలు వేసుకోని వారినే కాదు టీకాలు వేసుకున్న వారికి కూడా సోకుంతోంది.  దీనికి తోడు ఒమిక్రాన్ కూడా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా సోకుతుండటంతో ప్రజలు మరింత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి రోగం నుంచైనా తొందరగా బయటపడాలంటే రోగ నిరోధక శక్తి ఒక ఆయుధంలా పని చేస్తుంది కాబట్టి. ఇందుకోసం కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే సరి. మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

26

హెర్బల్ టీ:  మీకు టీలు తాగే అలవాటుంటే.. మీరు రోజూ తాగే టీని తాగడం మానేసి.. ఈ హెర్బల్ టీని తాగడం అలవాటు చేసుకోండి. దీన్ని తాగడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.

36


పసుపు పాలు: పసుపు పాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు ఈ పాలు గాయాలు త్వరగా మానేందుకు కూడా సహాయపడుతాయి. అలాగే నిద్రలేమితో బాధపడేవారు ప్రతిరోజూ పడుకునే ముందు గోరు వెచ్చటి పాలల్లో పసుపు వేసుకుని తాగితే బాగా నిద్రపడుతుంది. 
 

46

చ్యావన్ ప్రెస్: ఈ చ్యావన్ ప్రష్ ను వేడి నీరు లేదా పాలతో కూడా తీసుకోవచ్చు.. దీని ద్వారా కూడా మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు. 
 

56

ప్రాణాయామం: ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. అంతేకాదు దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ప్రాణాయామం: ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. అంతేకాదు దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 

66

పండ్లు: పండ్లలో ఎన్నో ప్రోటీన్లు, విటమిన్లు, లవణాలు పుష్కలంగా ఉంటాయి. పండ్ల ద్వారానే శరీరానికి కావాల్సిన సహజమైన పోషకాలు లభిస్తాయి. అంతేకాదు ఈ పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో కూడా బాగా ఉపయోగపడతాయి. అందుకే మీ రోజు వారి ఆహారంలో పండ్లు ఉండేలా చూసుకోండి. అందులో యాపిల్, బొప్పాయి, దానిమ్మ, జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ బి, సి, పొటాషియం, బీటా కెరోటిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, నిమ్మ, బత్తాయి పండ్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
 

click me!

Recommended Stories