Yoga Day 2022: యోగా చేయడానికి ఏది సరైన సమయం.. ఉదయమా? లేక సాయంత్రమా?

Published : Jun 20, 2022, 01:24 PM IST

Yoga Day 2022: యోగా మనల్ని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. యోగా ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అయితే కొంతమంది యోగాను ఉదయం చేస్తే.. మరికొంతమంది సాయంత్రం వేళ చేస్తుంటారు. ఈ రెండింటిలో ఏది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
19
Yoga Day 2022: యోగా చేయడానికి ఏది సరైన సమయం.. ఉదయమా? లేక  సాయంత్రమా?

యోగాతో ఎన్నో రోగాలు నయమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే క్రమం తప్పుకుండా యోగాను చేయాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అయితే కొంతమంది ఉదయం యోగాను చేస్తే.. మరికొంతమంది సాయంత్రం వేళ చేస్తుంది. ఇందులో యోగానుు చేయడానికి ఏది సరైన సమయమో ఇప్పుడు తెలుసుకుందాం.. 

29

యోగాను ఏ సమయంలోనైనా చేయవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. కానీ ఆచరణలో స్థిరత్వం ఉండాలి. మీ శరీరం, పరిసరాలు, మారుతున్న వాతావరణం, సమయం లభ్యత, రోజువారీ జీవనశైలిని బట్టి యోగా చేయడానికి మీరు సరైన సమయాన్ని ఎంచుకోవచ్చు. యోగా చేయడానికి సమయాన్ని నిర్ణయించుకునే ముందు ఈ విషయాలను తెలుసుకోవాలి.

39

ఉదయం యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:  ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తులు.. ఉదయాన్నే యోగా చేయడానికి ఇష్టపడతారు. ఉదయం పూట యోగా చేయడం వల్ల ఎండార్ఫిన్లను యాక్టివేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో ఆ రోజుకు మీ శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. 

49

ఉదయం పూట యోగా చేయడం ద్వారా.. మీరు పగటిపూట మీ పనిని మరింత మెరుగ్గా చేయగలుగుతారు. అలా ఉదయం పూట ఎక్కువ సేపు యోగాను చేయకూడదు.  ఎందుకంటే ఎక్కువ సేపు యోగా చేస్తే ఆ రోజంతా అలసిపోయినట్లుగా ఉంటారు. 

59

ఉదయం ఎలాంటి ఆసనాలు వేయాలి: ఉదయం పూట చిన్న చిన్న తేలికైన ఆసనాలను మాత్రమే చేయాలి. సూర్యనమస్కారాలు చేయడం, ముందుకు వంగడం, వెనుకకు వంగడం, ప్రాణాయామం, ధ్యానం చేయడం  వంటి చేయడం ఉత్తమం.

69

సాయంత్రం యోగా చేస్తే:  సాధారణంగా ఆలస్యంగా మేల్కొనే లేదా షిఫ్ట్ వైజ్ లో బిజీగా ఉండే వ్యక్తులు సాయంత్రం వేళ యోగా చేయడానికి ఇష్టపడతారు. సాయంత్రం యోగా చేస్తే.. అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

79

సాయంత్రం పూట యోగా చేయడం వల్ల రీఫ్రెష్ గా ఉండటంతో పాటుగా ప్రశాంతంగా కూడా ఉంటారు. అయితే సాయంత్రం పూట మీ శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే నైట్ టైం సరిగ్గా నిద్రపట్టదు. 
 

89

సాయంత్రం పూట ఎలాంటి యోగా చేయాలి?

సాయంత్రం యోగాలో శరీరాన్ని తిప్పడం, ముందుకు వెనుకకు వంగడం వంటి సౌకర్యవంతమైన భంగిమలు చేయాలి. ఈ సమయంలో వీపును ఎక్కువగా తిప్పడం, వేగంగా శ్వాసించకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని అధికంగా ప్రేరేపించడానికి కారణమవుతుంది. ఇది నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది. చివరగా శరీరాన్ని రిలాక్స్ చేయడానికి ప్రాణాయామం, ధ్యానంతో యోగాను ముగించండి.

99

2 గంటలపాటు యోగా చేయడం ప్రయోజనకరమైంది..

ఆహారాన్ని తీసుకున్న తరువాత కనీసం 2 గంటలపాటు యోగా చేయాలి. మీ జీవనశైలికి అనుగుణంగా యోగాకు సరైన సమయాన్ని నిర్ణయించడం సరైనదని గుర్తుంచుకోండి. అలాగే క్రమం తప్పకుండా యోగాను చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా సాధన చేస్తే.. అంత ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.  

Read more Photos on
click me!

Recommended Stories