అందంగా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. మార్కెట్లో ఇందుకు సంబంధించి ఎన్నో క్రీములు, సెరమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫెషియల్ కిట్స్ లభిస్తున్నాయి. అయితే స్పెర్మ్‌ను ఫెషియల్ కోసం ఉపయోగిస్తున్నారన్న విషయం మీకు తెలుసా.? వినడానికి ఇబ్బందిగా ఉన్న ఇది ముమ్మాటికీ నిజమే. ఎంతో మంది సెలబ్రిటీలు తమ అందాన్ని కాపాడుకునేందుకు ఈ స్పెర్మ్ ఫేషియల్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంతకీ ఏంటీ స్పెర్మ్ ఫేషియల్.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
three women were likely infected with HIV
కిమ్ కర్ధాషియాన్ అనే హాలీవుడ్ నటి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను స్పెర్మ్‌తో ఫేషియల్ చేయంచుకుంటానని, అదే తన సౌందర్య రహస్యమని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ స్పెర్మ్ మనుషుల నుంచి సేకరించింది కాదండోయ్. ప్రత్యేకంగా పెంచిన సాల్మన్ చేపల నుంచి సేకరించిన వీర్యం. ఈ చేపల వీర్యంలోని డీఎన్‌స్త్రతో ఫేషియల్ మాత్రమే కాకుండా రకరకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు.
భారత్‌లోనూ
ఈ స్పెర్మ్‌లో ఉండే పాలీడియోక్సిరిబోన్యూక్లియోటైడ్స్ అనే పదార్థంతో ఈ ఫేషియల్‌ను తయారు చేస్తారు. భారత్‌లోనూ ఈ ఫేషియల్‌ను పలువురు ఫాలో అవుతున్నారు. కొన్ని బ్యూటీ సెంటర్స్ స్పెర్మ్ ఫేషియల్ సేవలను అందిస్తున్నాయి. ఇందులో మొత్తం మూడు రకాల విధానాలను అవలంబిస్తుంటారు. వీటిలో మొదటిది టాపికల్ అప్లికేషన్ ఇందుకోసం సుమారు రూ. 15 వేల నుంచి రూ. 50 వేల వరకు ఛార్జ్ చేస్తారు. మైక్రోనీడిండ్ విధానానికి సుమారు రూ. 40 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక స్పెర్మ్‌లోని డీఎన్‌ఏను ఇన్జెక్ట్ చేయడానికి ఏకంగా రూ. 80 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు.
ఉపయోగాలు ఏంటంటే
సాల్మన్ ఫిష్ స్పెర్మ్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చర్మంపై మంటను తగ్గించడంతో పాటు, గాయాలను మాన్చడంలో ఉపయోగపడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇక ఈ ఫేషియల్ యాంటీ ఏజింగ్‌గా ఉపయోగపడుతుంది. అంటే వయసుతో పాటు వచ్చే ముడతలు తగ్గి, నిత్యం యవ్వనంగా కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది.
నిపుణులు ఏమంటున్నారంటే..
యాంటీ ఏజింగ్, హైడ్రేషన్, చర్మం కాంతివంతంగా మారాలని కోరుకుంటున్న వారికి ఈ ఫేషియల్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ముఖం నిర్జలంగా మారి నిస్తేజంగా ఉన్న వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుందని చెబుతున్నారు. అయితే అనుభవజ్ఞులైన చర్మవ్యాధి నిపుణుల సమయంలోనే ఈ ఫేషియల్ చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చికిత్సకు ఉపయోగించే స్పెర్మ్ నాణ్యత లేక పోయినా, చికిత్స విధానంలో ఏవైనా లోపాలున్నా అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, చర్మంపై వాపునకు దారి తీసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే చర్మ వైద్యుల సూచన మేరకే ఇలాంటి విధానాలు పాటించాలని అంటున్నారు.
గమనిక: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఒకవేళ ఈ చికిత్సను తీసుకోవాలని అనుకుంటే కచ్చితంగా ముందు వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు నిర్ణయం తీసుకోవాలి.