కూలడ్రింక్స్…
పిల్లలు తమ తల్లిదండ్రులతో బయటకు వెళ్లినప్పుడల్లా కూల్ డ్రింక్స్ కొనిపెట్టమని ఏడుస్తూ ఉంటారు. కానీ.. వారు ఎంత ఏడ్చినా కూడా ఐదేళ్ల లోపు పిల్లలకు కొనివ్వకూడదు. ఎందుకంటే.. వాటిలో చక్కెర ,కెఫిన్ చాలా ఉన్నాయి, ఇది ఊబకాయం, గ్యాస్ ,జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
నట్స్..
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు బాదం, పిస్తా, వాల్‌నట్ వంటి గింజలను ఎక్కువగా తినకూడదు ఎందుకంటే వారు వాటిని సరిగ్గా నమలలేరు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. వాంతులు ,విరేచనాలు వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది.