Sun Light: 24గంటలపాటు సూర్యుడి వెలుగు భూమి మీద పడకపోతే ఏమౌతుంది?

Published : Oct 23, 2026, 11:30 AM IST

Sun Light: రోజంతా ఎండలు ఎక్కువగా ఉంటే.. అందరూ తిట్టుకుంటారు. కానీ, అసలు సూర్యుని వెలుగు భూమి మీద పడకపోతే ఏమౌతుంది? జీవితం ఎలా మారుతుంది? మనుషులు, జంతువులు బతకగలరా?

PREV
13
సూర్యుడు మాయమైతే ఏమౌతుంది?

ఒక్క రోజు కరెంట్ లేకపోతేనే మన జీవితం అతలాకుతలమైపోతుంది. మరి, అలాంటిది, మన జీవితంలో సడెన్ గా ఒక్కరోజు సూర్యుడు కనిపించకుండా, ఆ సూర్యుని వెలుగు భూమి మీద పడకపోతే ఏం జరుగుతుంది? మహా అంటే ఏం జరుగుతుంది...?ఆ రోజు పగలు కూడా చీకటిగా ఉంటుంది. రాత్రిలాగా ఉంటుంది అంతే కదా అని అనుకుంటున్నారా? ఒక్క రోజు సూర్యుని వెలుగు తగలకపోయినా.. జీవితం ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం..

23
పగటిపూట కటిక చీకటి...

సూర్యుడు అదృశ్యమైన మరుక్షణమే భూమిపై చీకటి అలుముకోదు. సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది. ఆ తర్వాత భూమి అంధకారంలో మునిగిపోతుంది. అయితే, మరీ పూర్తిగా చీకటిగా మారకపోవచ్చు. నక్షత్రాల కాంతి, మనుషులు తయారు చేసుకున్న ఆర్టిఫీషియల్ లైట్స్ ఉంటాయి కాబట్టి... కొంత వరకు ఇవి కూడా వెలుగును అందిస్తాయి. కాకపోతే, సూర్యుడి కాంతి ప్రతిఫలించే అవకాశం లేకపోవడంతో చంద్రుడు కూడా ప్రకాశించడు.

భూమి గడ్డకట్టుకుపోతుందా?

సౌరశక్తి లేకపోతే భూమి ఉపరితలం చల్లబడటం మొదలౌతుంది. అయితే, 24 గంటల వ్యవధిలోనే భూమండలం మొత్తం గడ్డకట్టుకుపోదు. మన సముద్రాలలో నిల్వ ఉన్న భారీ ఉష్ణ శక్తి భూమి వేగంగా చల్లపడకుండా కాపాడుతుంది. కాబట్టి, ఒక రోజులో ఉష్ఱోగ్రతలు పడిపోయినా, జీవులకు తక్షణ ప్రాణాపాయం కలిగించేంత మంచు అయితే కురవదు.

33
మొక్కలు బతుకుతాయా?

సూర్యరశ్మి లేకపోవడం వల్ల మొక్కల కిరణజన్య సంయోగక్రియ పూర్తిగా నిలిచిపోతుంది. అంటే అవి ఆహారాన్ని తయారుచేసుకోలేవు. అయినప్పటికీ, ఒక్క రోజులోనే చెట్లన్నీ ఎండిపోవు. మొక్కలు అంతకుముందు నిల్వ చేసుకున్న శక్తిని ఉపయోగించుకుని ఈ 24 గంటల కాలాన్ని తట్టుకోగలవు.

మనుషులు, జంతువులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

సూర్యకాంతి లేకపోవడం వల్ల మానవులతో పాటు జంతువులు, పక్షుల నిద్ర-మెలకువ చక్రం దెబ్బతింటుంది. పక్షులు ఆహార సేకరణ మాని గందరగోళానికి గురవుతాయి. అయితే, కేవలం 24 గంటల చీకటి వల్ల మానవ ఆరోగ్యంపై తీవ్రమైన తక్షణ దుష్ప్రభావాలు ఏవీ పడవు.

 విద్యుత్, ఆహార కొరత వస్తుందా? 

సూర్యకాంతి లేనందున సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సున్నాకి పడిపోతుంది. దీనివల్ల పవర్ గ్రిడ్లపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

 గురుత్వాకర్షణ శక్తి కనుమరుగైతే ఏమవుతుంది? 

సూర్యుడు కేవలం వెలుగును మాత్రమే కాదు, భూమిని తన వైపు పట్టి ఉంచే గురుత్వాకర్షణ శక్తిని (Gravity) కూడా అందిస్తున్నాడు. ఒకవేళ సూర్యుడితో పాటు అతని గురుత్వాకర్షణ కూడా కనుమరుగైతే, భూమి తన నిర్దిష్ట కక్ష్య (Orbit) నుండి పక్కకు తప్పుకుని, అంతరిక్షంలో నిరంతరం ముందుకెళ్లే ఒక అనంత ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories