ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
మన ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే.. మనం అంత ఆరోగ్యంగా ఉంటాం.. ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే దగ్గు, జలుబు, సీజనల్ వ్యాధులతో పాటుగా ఎన్నో రోగాలు వస్తాయి.
అయితే వెండి ఉంగరాలను ధరించడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలా అంటే.. వెండిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో అంటువ్యాధులకు మీరు దూరంగా ఉంటారు.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. అయితే వెండి మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి బాగా ఉపయోగపడుతుంది.
వెండి శరీరంలో విద్యుదయస్కాంత వికిరణాన్ని ప్రతిబింబించే వాహక క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.