slate pencil
చాలా మంది చిన్న పిల్లలు మాత్రమే బలపాలను తింటారని అనుకుంటారు. కానీ చాలా మంది ఎవ్వరికీ తెలియకుండా బలపాలను తింటుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు, పిల్లలే దీన్ని ఎక్కువగా తింటుంటారు. నిజానికి బలపాలను తినే అలవాటు చిన్న వయసులోనే ఉంటుంది. ఆ తర్వాత ఈ అలవాటు మానుతుంది.
slate pencil
కానీ చిన్న పిల్లలు బలపాలను తినే అలవాటును అంత తొందరగా మానుకోరు. అయినా కొన్ని రోజులకు వాళ్లంతట వాళ్లే మానేస్తుంటారు. చిన్న పిల్లల సంగతి పక్కన పెడితే పెద్దవయసు ఆడవారు కూడా బలపాలను బాగా తింటుంటారు. ఎందుకే స్లేట్ స్టిక్ అంత టేస్టీగా ఉంటుంది మరి. కానీ బలపాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవును వీటిని తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
chalk
చిన్నప్పుడు బలపాలను తింటే వచ్చే అనారోగ్య సమస్యల గురించి చాలా మందికి తెలియదు. అంటే వారికి అర్థం కాదు. కానీ పెద్దవయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ అర్థమవుతాయి. అందుకే బలపాలను తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
slate pencil
బలపాలను సున్నంతో కలిపి తయారుచేస్తారు. ఈ సున్నం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ పిల్లలు స్లేట్ స్టిక్స్ ను ఎక్కువగా తింటారు. దీనికి కారణం.. వారి శరీరంలో ఐరన్ లోపం ఉండటడే. ఐరన్ లోపం ఎక్కువగా ఉండే పిల్లలు బలపాలను ఎక్కువగా తింటుంటారు.
slate pencil
మగవారితో పోలిస్తే ఆడవారికే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో బలపాలను తినడం కూడా ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వారు చిన్నప్పుడు బలపాలను తిన్న దాని ఫలితమే ఇది.
బలపాలను తింటే జీర్ణ సమస్యలు, రక్తహీనత వస్తాయి. అలాగే బలపాలను తినడం వల్ల ప్రభావితమయ్యే మొదటి అవయవం మూత్రపిండాలు. అలాగే దీన్ని తినడం వల్ల డయేరియా, రుతుస్రావం ఆలస్యం కావడం, కడుపులో కణితులు వంటి సమస్యలు కూడా వస్తాయి.
అలాగే బలపాలను తినడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. కాలక్రమేణా దంతాలు అనారోగ్యం బారిన పడతాయి. అంతేకాదు దీని వినియోగం దవడపై ప్రభావం చూపుతుంది. ఇది దవడలో నొప్పిని కలిగిస్తుంది.