రోజూ సోంపు వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 9, 2024, 1:53 PM IST

సోంపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సోంపును తింటే తిన్నది సులభంగా జీర్ణమవుతుందన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే రోజూ సోంపు వాటర్ ను తాగడం అలవాటు చేసుకుంటే కూడా మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. అవేంటేంటంటే?

fennel water

సోంపులో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. చాలా మంది సోంపు గింజలను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. కానీ ఇవి చేసే మేలు గురించి మాత్రం తెలియదు. చాలా మంది తిన్న వెంటనే సోంపు గింజలను నములుతుంటారు. ఎందుకంటే ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సోంపు గింజలను తినడంతో పాటుగా సోంపు వాటర్ ను తాగినా కూడా మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

fennel water


జీర్ణ సమస్యలు 

సోంపు గింజల్లో అనెథాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో పొత్తి కడుపు నొప్పి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

Latest Videos


fennel water

తల్లి పాల పెంపు

సోంపులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. అలాగే వీటిలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు వంటి శోథ నిరోధక సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే తల్లి పాల ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఈ వాటర్ ఆడవారిలో నెలసరి నొప్పి, పొత్తికడుపు నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

fennel water

సోంపు గింజలు పొటాషియానికి మంచి మూలం. అవి మీరు అతిగా తినకుండా ఉండటానికి సహాయపడతాయి. అలాగే సోంపు గింజలు మూత్రవిసర్జన స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంతో శరీరం నుంచి వివిధ రకాల టాక్సిన్స్ , అదనపు ద్రవాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. 

షుగర్ లెవల్స్ కంట్రోల్ 

కొన్ని అధ్యయనాలు సోంపు గింజలలోని సమ్మేళనాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయని వెళ్లడించాయి. ఈ వాటర్ భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తుంది. ఈ వాటర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

బరువు తగ్గుతారు

సోంపు నీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే దీని మూత్రవిసర్జన లక్షణాలు.. నీరు నిలుపుదల, కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. సోంపు గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి, మీ ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
 


కంటి చూపును మెరుగుపరుస్తుంది

విటమిన్ ఎ ఎక్కువగా ఉండే సోంపు గింజలు వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే ఇతర కంటి వ్యాధుల నుంచి రక్షించడానికి కూడా ఈ వాటర్ సహాయపడుతుంది. 
 

click me!