30 ఏండ్ల తర్వాత మగవారు హెల్తీగా, యంగ్ గా ఉండటానికి ఏం చేయాలో తెలుసా?

First Published | Jun 9, 2024, 12:00 PM IST

30 ఏండ్ల తర్వాత శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా లేనిపోని వ్యాధులు రావడం ప్రారంభమవుతుంది. ఈ వయసులో ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. కొన్ని రకాల ఆహారాలు 30 ఏండ్ల వయసులో మగవారిని హెల్తీగా, యంగ్ గా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. 
 

ప్రతి మనిషికి వారి వయసుకు తగ్గ పోషకాహారం అవసరం. ఇలా పోషకాలను తీసుకుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. హెల్తీ ఫుడ్ తో శరీరానికి మంచి పోషణ అందుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతి వయస్సులో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ రోజువారి ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను చేర్చడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. మీ మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి 30 ఏండ్ల తర్వాత మీ రోజువారి ఆహారంలో ఏయే పోషకాలు చేర్చుకోవాలో ఇప్పుడు  తెలుసుకుందాం.. 

Vitamin D

విటమిన్ డి

30 సంవత్సరాల తర్వాత  ప్రతి ఒక్కరి శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కండరాలు, శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అయితే విటమిన్ డి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే ఎముకలకు కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి, కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
 

Latest Videos


vitamin k

విటమిన్ కె

ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి కూడా విటమిన్ కె చాలా అవసరం. విటమిన్ కె వృద్ధాప్యం ఉన్న పురుషులలో చిత్తవైకల్యం సమస్య నుంచి రక్షిస్తుంది. ఆకుకూరలు, కొన్నిరకాల నూనెలు, పండ్లలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. 
 

vitamin A

విటమిన్ ఎ

విటమిన్ ఎ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. విటమిన్ ఎ రోగనిరోధక శక్తి ని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  కంటిచూపును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత పురుషుల్లో ప్రోస్టేట్ ఆరోగ్యానికి విటమిన్ ఎ అవసరం. పాల ఉత్పత్తులు, క్యారెట్లు, చిలగడదుంపల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. 
 

vitamin b12

విటమిన్ బి 12

30 సంవత్సరాల తర్వాత పురుషుల శరీరంలో నాడీ వ్యవస్థ బలహీపడటం మొదలవుతుంది. అయితే ఇది బలంగా ఉండటానికి విటమిన్ బి 12  ఎంతో అవసరం. విటమిన్ బి12 శక్తి స్థాయిని నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ఈ విటమిన్ బి12 జంతువుల ఆధారిత ఆహారాల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకే మాంసం, చేపలు, గుడ్లను తినండి. 

మెగ్నీషియం

30 సంవత్సరాల తర్వాత మెగ్నీషియాన్ని పుష్కలంగా తీసుకోవాలి. ఇది గుండె ఆరోగ్యానికి, కండరాల ఆరోగ్యానికి చాలా అవసరం. అంతేకాదు మెగ్నీషియం మీరు బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
 

click me!