Egg Yolk: గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది?

Published : Feb 10, 2026, 04:31 PM IST

Egg Yolk: కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడి చాలామంది గుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేస్తారు. అసలు నిజంగా పచ్చసొన తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? గుడ్డులో విటమిన్లు ఎ, డి, ఇ, కె వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

PREV
14
గుడ్డులోని పచ్చసొన తినవచ్చా?

చాలా మంది ఉడకబెట్టిన గుడ్డులో తెల్ల సొన తింటారు కానీ, పచ్చసొన మాత్రం తినేందుకు ఇష్టపడరు. ఆ పచ్చసొన తినడం వల్ల  రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయం ఎక్కువ.  అందుకే ఎంతో మంది తెల్లసొన తిని పచ్చసొన బయటపడేస్తారు. నిజంగా పచ్చసొన కొలెస్ట్రాల్‌ను పెంచుతుందా?  గుడ్డులోని పచ్చసొన తినడం అంత ప్రమాదమా? 

24
పచ్చసొన తింటే ఏం లాభం?

గుడ్డులోని పచ్చసొన తినడం చాలా అవసరం. కేవలం కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడి పచ్చసొన తినడం మానేస్తే ఎన్నో పోషకాలను కోల్పోతున్నట్టే.  ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకుని తినాలి.  ఆ సమస్య లేని వారు హాయిగా గుడ్డులోని పచ్చసొనను తినవచ్చు. తినడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా. పచ్చసొనలో  కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి, విటమిన్లు జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. పచ్చసొనలో ఉండేది కూడా మంచి కొవ్వు. అది మన శరీరానికి ఎంతో అవసరం.

34
పచ్చసొన హానికరం కాదు

అన్ని రాకల ఆరోగ్యంగా ఉన్నవారికి గుడ్డు పచ్చసొన వల్ల ఎలాంటి హాని జరగదు. దీన్ని ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమని చెప్పుోవాలి. గుడ్డులోని కొలెస్ట్రాల్ రక్తంలోని కొలెస్ట్రాల్‌పై చాలా తక్కువ ప్రభావమే చూపిస్తుంది. కాబట్టి తినేందుకు భయపడకూడదు. పచ్చసొనను మితంగా తింటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలపై పెద్దగా ప్రభావం ఉండదని ఎన్నో అధ్యయనాలు కూడా తేల్చి చెప్పాయి. పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ ఏమాత్రం హానికరం కాదు.

44
వీరు తినవద్దు

నిజానికి గుడ్డును సంపూర్ణ ఆహారంగా చెప్పుకుంటారు.  పచ్చసొనతో సహా పూర్తి గుడ్డు పోషకాలతో నిండి ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే ఎంతో మంచిది.  అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం గుడ్డులోపి పచ్చసొన తినకపోవడమే మంచిది. గుండె జబ్బులు, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు పచ్చసొన తక్కువగా తింటే మంచిది. ఈ ఆరోగ్య సమస్యలు లేని వాళ్లు దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా పూర్తిగా పచ్చసొన మానేయాల్సిన అవసరం లేదు. వారానికి రెండు మూడు తినవచ్చు. గుడ్డు పచ్చసొనలో విటమిన్ B9 రూపమైన ఫోలేట్ ఉంటుంది. గర్భిణులకు ఈ పోషకం చాలా అవసరం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందడానికి కూడా పచ్చసొన తినడం మంచిది. అలాగే కళ్ల ఆరోగ్యానికి అవసరమైన ల్యూటీన్, జియాక్సంతిన్ ఇందులో ఉంటుంది. కాబట్టి గుడ్డును పచ్చసొనతో పాటూ తినడం ఎంతో అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories