వర్షాకాలంలో పెరుగు తినొచ్చా..? లేదా..?

Published : Jun 24, 2022, 02:06 PM IST

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు. ముఖ్యంగా ఈ సీజన్ లో జీర్ణ ప్రక్రియ బలహీనంగా మారుతుందని చెబుతుంటారు. అందుకే కొన్ని వస్తువులను అస్సలు తినకూడదు. ఇందులో పెరుగు (curd) కూడా ఉంది.

PREV
18
 వర్షాకాలంలో పెరుగు తినొచ్చా..? లేదా..?

వర్షాకాలంతో పాటుగా ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో కొన్ని రకాల ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత  మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో జీర్ణక్రియ బలహీనంగా మారుతుంది.  అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఈ లీస్ట్ లో పెరుగు కూడా ఉంది. పెరుగు మన ఆరోగ్యానికి మంచి చేసేదే అయినా.. వర్షాకాలంలో పెరును తినకపోవడమే మంచిదని కొంతమంది సలహానిస్తున్నారు. మరి దీనిపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

28


వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని కొందరు అంటున్నారు. దీనిపై ఆయుర్వేద వైద్యులు వేర్వేరు సలహాలు ఇస్తారు. ఆయుర్వేదం ప్రకారం.. వర్షాకాలంలో పెరుగు తినకూడదు. పెరుగు చల్లగా ఉంటుంది. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. పెరుగు తినడం వల్ల కఫం ఏర్పడుతుంది. అందుకే ఈ సీజన్ లో పెరుగు తినడం మానుకోవాలి. 
 

38

పెరుగులో abhishyandi గుణాలు ఉన్నాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. abhishyandi అనేది ఆహారం తీసుకున్న తరువాత సంభవించే పరిస్థితి. దీనిలో శరీర రంధ్రాలు మూసివేయబడతాయి. దీని వల్ల గొంతు నొప్పి, కఫంతో పాటుగా కీళ్ల నొప్పి సమస్య కూడా వస్తుంది. 

48

జలుబుకు అలెర్జీ ఉన్నవారు పెరుగు తినడం మానుకోవాలి

శాస్త్రీయంగా పెరుగును అన్ని సీజన్లలో తినవచ్చు. సీజన్ ను బట్టి తక్కువ లేదా ఎక్కువగా తినాలి. జలుబు, అలెర్జీ ఉన్నవారు వర్షాకాలంలో, చలిలో పెరుగుకు దూరంగా ఉండాలి. పెరుగులో విటమిన్లు, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 

58

ఇది మంచి బ్యాక్టీరియాను కూడా కలిగి ఉంటుంది. అంటే మన గట్ ను బలోపేతం చేసే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. పెరుగు గ్యాస్ సమస్య, కడు ఉబ్బరం, విరేచనాల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే వర్షాకాలంలో మధ్యాహ్న భోజనం సమయంలో ఒక కప్పు పెరుగును తినొచ్చు.
 

68


రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి

రాత్రిపూట పెరుగును తినడం మానుకోవాలని కూడా కొందరు చెప్తుంటారు. కానీ డాక్టర్లు మాత్రం పెరుగును ఏ సమయంలో నైనా తినొచ్చని సలహానిస్తున్నారు. అయితే పెరుగులో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట దీన్ని తింటే తొందరగా జీర్ణం కావాలి. కానీ ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే దీనిని రైతా రూపంలో తీసుకోవచ్చు. 
 

78

ఆయుర్వేదం ప్రకారం.. వర్షాకాలం ప్రారంభంలో పెరుగు ఎలాంటి భయాలు లేకుండా తినొచ్చు.  కానీ చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి.  ఎక్కువగా తీసుకుంటే శరీరంలో తీవ్రమైన నొప్పి, జీర్ణక్రియలో ఇబ్బంది, జ్వరానికి దారితీస్తుంది.
 

88

వర్షాకాలంలో పెరుగును తినే వారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

1. పెరుగు పరిమాణాన్ని పూర్తిగా తగ్గించాలి.
2. మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు పెరుగును మాత్రమే తినాలి. 
3. రాత్రిపూట పెరుగును అస్సలు తినకండి. రైతాను మాత్రమే తినండి. 
4. మాసంలో తిన్నప్పుడు పెరుగును తినకపోవడమే మంచిది. 
5. జలుబు, అలర్జీ సమస్యలు ఉంటే వర్షాకాలంలో పెరుగు అస్సలు తినకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories