Weight Loss Tips: పెరుగును ఇలా తింటే కేవలం కొన్ని వారాల్లోనే కిలోల బరువు తగ్గుతారు తెలుసా..?

Published : Jul 21, 2022, 04:26 PM IST

Weight Loss Tips: అధిక బరువుతో బాధపడేవారికి ఏ ఫుడ్ ను తీసుకోవాలన్నా భయం భయంగానే ఉంటుంది. ఏ ఆహారం ఎంత బరువును పెంచుతుందోనని. అయితే పెరుగును కొన్ని పద్దతుల్లో తింటే కొన్ని వారాల్లోనే కిలోల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

PREV
16
Weight Loss Tips: పెరుగును ఇలా తింటే కేవలం కొన్ని వారాల్లోనే కిలోల బరువు తగ్గుతారు తెలుసా..?

బరువు తగ్గడం అంత సులువు కాదు. దీనికోసం ఎంతో కష్టించాల్సి ఉంటుంది. రెగ్యులర్ వ్యాయామం చేయడంతో పాటుగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి.  ఆయిలీ ఫుడ్ జోలికి అసలే పోకూడదు. ఇవన్నీ రెగ్యులర్ గా ఫాలో అయితేనే  సులువుగా బరువు తగ్గుతారు. అయితే ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు పెరుగు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..  
 

26

పెరుగు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగులో కొవ్వును కరిగించే గుణాంటాయి. దీనిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈ జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అయితే జీవక్రియ మెరుగ్గా పనిచేసినప్పుడే వేగంగా బరువు తగ్గుతారు. 
 

36

పెరుగులో ప్రోటీన్లు కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి. దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో చాలా సేపటి వరకు ఆకలి వేయదు. 

46

పెరుగును ఏవిధంగా తింటే బరువు తగ్గుతారు

ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకునే వారు రోజు వారి ఆహారంలో పెరుగును చేర్చుకోవాలి. దీనికోసం ఒక కప్పు పెరుగును తీసుకోండి. దీనిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో, మధ్యాహ్నం లంచ్ లో, నైట్ డిన్నర్ లో తినండి. ఇది మీరు అధికంగా తినకుండా చేసుంది. దీంతో మీరు క్రమం క్రమంగా బరువు తగ్గుతారు. 

56

పెరుగు, డ్రై ఫ్రూట్స్

పెరుగుతో ఉత్తమ ఫలితాలు పొందాలనుకుంటే పెరుగుకు డ్రై ఫ్రూట్స్ ను జోడించొచ్చు. పెరుగులో డ్రై ఫ్రూట్స్ ను మిక్స్ చేయడం ద్వారా మీ శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి. పెరుగు, డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ లో తినడం వల్ల మీ కడుపు చాలా సేపటి వరకు నిండుగానే ఉంటుంది. ఇది మధ్య మధ్యలో చిరుతిళ్లలను తినకుండా కాపాడుతుంది. ఇది మీరు వేగంగా కిలోల్లో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

66

పెరుగు, నల్ల మిరియాలు

ఒక్క పెరుగునే తినాలంటే కొన్ని కొన్ని సార్లు విసుగ్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు పెరుగుకు నల్లమిరియాలను కలపొచ్చు. బరువు తగ్గాలను పెరుగును తినేవారు ఒక కప్పు పెరుగుకు నల్ల మిరియాల పొడిని కలిపి తినొచ్చు. ఈ రెండూ మీరు వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి.   

Read more Photos on
click me!

Recommended Stories