ఎర్ర రక్తకణాలో కనిపించే ఇనుము ఎక్కువగా ఉండే ప్రోటీనే హిమోగ్లోబిన్. ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సక్రమంగా సరఫరా కావడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఇది తగ్గితే తీవ్రమైన అలసట, తలనొప్పి, మైకము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ క్రింది ఆహారాలు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి.