గుండెపోటుతో చనిపోయేవారు ఎక్కువవుతున్నారు.. మీకు ఈ ప్రమాదం తప్పాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Published : Oct 18, 2022, 04:05 PM IST

సంతోషంగా ఆటలు ఆడుతూ.. డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోతున్న వీటిడియోలను ఈ మధ్య చాలానే చూసి ఉంటారు. అసలు గుండెపోటు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి..   

PREV
17
గుండెపోటుతో చనిపోయేవారు ఎక్కువవుతున్నారు.. మీకు ఈ ప్రమాదం తప్పాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

గుండె కొట్టుకున్నంత వరకు మనిషి బతికి ఉండేది.  గుండె కొట్టుకోవడం ఆగిపోతే.. ఇక ఈ మనిషి లేడని అర్థం. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో చెడు జీవనశైలి కారణంగా గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి.  నిన్న మొన్న ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సడన్ గా గుండెపోటుతో అక్కడిక్కడే ప్రాణాలు విడుస్తున్నారు. అలా జరగకూడదంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

27

వ్యాయామం చేయడం మానొద్దు: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరక శ్రమ చాలా అవసరం. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ కారణంగా వ్యాయామం చేయలేకపోతున్నారు. అంత సమయం కేటాయించని వారు కూడా ఉన్నారు. కానీ ఒత్తిడి తగ్గడానికి, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందు వ్యాయామాన్ని ఖచ్చితంగా చేయాలి. లేకపోతే సర్వరోగాలు మీకే చుట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండె పోటు రావొచ్చు.  ఈ ప్రమాదాలన్నీ మాకు వద్దు అనుకుంటే క్రమం తప్పకుండా వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలను చేయండి. 
 

37

తక్కువ మాంసం, ఎక్కువ ఆకుకూరలు తినండి: మనం తీసుకునే  ఆహారం కూడా మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపెడుతాయి. నోటికి రుచిగా అనిపించే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లల్లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇక కొన్ని ఆహారాల్లో అయితే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి మన శరీరంలో పోషకాలు ఎక్కువైనా ప్రమాదమే. అందుకే మాంసాహారాలను తక్కువగా తినాలి. ఆకు కూరలు, కూరగాయలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

47

ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినండి: జంక్ ఫుడ్, ఫ్రైడ్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాల్లే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటాయి. నిజానికి ఇందులో వాడే ఆయిల్స్, మసాలాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఆహారాలను తినండి. డ్రై ఫ్రూట్స్, ధాన్యాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.  

57

టీవీ తక్కువగా చూడండి: టీవీ, ఫోన్ చూస్తుంటే  అస్సలు టైం యే తెల్వదు. టీవీ, సెల్ ఫోన్ లో లీనమవ్వడం వల్ల బరువు పెరగడం, బీపీ పెరగడం, నుంచి నిద్రలేమి వరకు ఎన్నో సమస్యలు వస్తాయి. కంటి నిండా నిద్ర ఉంటేనే మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు. ఏ వయసు వారు ఎన్ని గంటలు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారో అన్ని గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. పెద్దలకు హృదయ సంబంధ వ్యాధులు రాకూడదంటే ప్రతి రోజూ రాత్రి ఏడు లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోవాలి. 
 

67

పొగాకుకు దూరంగా ఉండాలి:  సిగరేట్ ఒక వ్యక్తిని ఏ విధంగా నాశనం చేయాలో అన్ని విధాలా చేసతుంది. మీకు తెలుసా.. ప్రతి సంవత్సరం సుమారు 1.35 మిలియన్ల మంది కేవవలం పొగాకు వల్లే మరణిస్తున్నారు. సిగరెట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. ధూమపానం ప్రాణాంతకం. కలుషితమైన పొగ వల్ల కూడా గుండె నాళాలు ప్రభావితమవుతాయి. కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోకండి. 

77

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి: ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. వీటివల్లే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది. కనీసం ఏడాదికోసారైనా టెస్టులు చేయించుకోండి. ఏ రోగమైనా ప్రారంభదశలో గుర్తిస్తే.. దాని త్వరగా నయం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ కుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉన్నవారు ఉంటే గుండె చెకప్ తప్పకుండా చేయించుకోవాలి. 

Read more Photos on
click me!

Recommended Stories