Weight Loss Tips: ఈ వాటర్ బరువును తగ్గించడమే కాదు.. మిమ్మల్ని అందంగా తయారుచేస్తుంది కూడా..

First Published Jun 27, 2022, 2:47 PM IST

Weight Loss Tips: పుదీనీలో ఎన్నో ఔషద గుణాలుంటాయి. పుదీనా వాటర్ ను తాగడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటుగా.. మీ ముఖం అందంగా మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

ఈ రోజుల్లో అధిక బరువు సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే.. పెద్ద వయసు వారు సైతం దీని బారిన పడుతున్నారు. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామాలు చేస్తూ.. డైట్ ఫాలో అయినా బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. కానీ అధిక బరువు, ఊబకాయం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఈ సమస్య నుంచి వీలైనంత తొందరగా బయటపడాలి. 
 

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య అధిక బరువు (Overweight). శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ కారణంగా బరువు పెరిగి అనేక అనారోగ్య సమస్యలను (Illness issues) ఎదుర్కొంటున్నారు.
 

బరువు తగ్గే ప్రాసెస్ చాలా నిదానంగా సాగుతుంది. కాస్త ఓపికతో మన ప్రయత్నాలను కొనసాగిస్తే.. అధిక బరువు నుంచి మీరు సులభంగా బయటపడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

అయితే అధిక బరువు వల్ల శరీర నిర్మాణం కూడా క్షీణిస్తుంది. ఇక కొంతమంది ఊబకాయాన్ని తగ్గించడానికి వైద్య మందులను కూడా ఆశ్రయిస్తారు. దీనివల్ల  సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. బరువు సహజపద్దతిలో తగ్గించుకుంటే ఎలాంట  సమస్యలూ ఉండవు. అయితే సహజ పద్దతిలో బరువు తగ్గాలనుకునే వారికి పుదీనా నీళ్లు చక్కటి మెడిసిన్ లా పనిచేస్తాయి. వాస్తవానికి పుదీనా నీరు తాగడం వల్ల ఊబకాయాన్ని నియంత్రించవచ్చు.

పుదీనా ఒక ఆయుర్వేద ఔషధం. దీనిని వివిధ రకాల వ్యాధుల నివారణకు కూడా ఉపయోగిస్తారు. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. పుదీనాలో ముఖ్యంగా విటమిన్ C , విటమిన్ D , విటమిన్ E , విటమిన్ B లు అధికంగా ఉండడంతో పాటు క్యాల్షియం, పాస్పరస్ వంటి మూలకాలు వలన రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలు సైతం దూరం అవుతాయి. 

పుదీనా రక్త ప్రసరణను క్రమబద్దీకరించడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, గొంతునొప్పి వంటి సమస్యలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.  పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేసి ఈ మిశ్రమంతో దంతాలు తోముకోవడం వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

పుదీనాను తీసుకోవడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది. పొట్టకు సంబంధిత వ్యాధులకు దూరం చేస్తుంది. వేసవిలో పుదీనాను తీసుకోవడం వల్ల శరీరం వేడి తగ్గుతుంది. అయితే పుదీనా అధిక బరువును కూడా తగ్గిస్తుంది. అదెలాగంటే..

బరువు తగ్గడానికి ఎలా ఉపయోగించాలి: ఊబకాయం నుంచి బయటపడేందుకు పుదీనా మీకు చక్కటి మెడిసిన్ లా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు 10 పుదీనా ఆకులను తీసుకోండి. వీటిని మిక్సీలో వేసి అలాగే అందులో 1 గ్లాసు నీరు పోసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులో నల్ల మిరియాలు, నల్ల ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఒక గ్లాసులోకి తీసుకోండి. ఈ పుదీనా నీటిని ప్రతిరోజూ తాగితే ఊబకాయం తగ్గుతుంది. ఎందుకంటే పుదీనా కొవ్వును కరిగిస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి సహాయపడుతుంది. 

click me!