Kidney Stone: ఈ జ్యూస్ లు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి..

First Published Jun 27, 2022, 2:07 PM IST

Kidney Stone: కిడ్నీల్లో రాళ్ల నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. అయితే ఈ రాళ్లను కరిగించేందుకు ఈ జ్యూస్ లు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 
 

kidney

కిడ్నీల ఆరోగ్యం బాగున్నప్పుడే మనం అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే మన శరీరంలో ఉండే విషపదార్థాలను కిడ్నీలే బయటకు పంపిస్తాయి. దీనివల్లే మనం ఇంత అరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అయితే వీటి పనితీరుకు చిన్న ఆటంకం కలిగినా మన ఆరోగ్యం దెబ్బతింటుంది.
 

నీళ్లను తక్కువగా తాగని వారి కిడ్నీల్లోనే రాళ్లు ఏర్పడుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రాళ్లు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. యూరిక్ ఆమ్లాలు, లవణాలు, కాల్షియం, ఖనిజాల సమూహమే.. మూత్రపిండాల్లో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. 

అయితే మూత్రపిండాల్లో రాళ్లు చిన్న సైజులో ఉంటే ఎలాంటి సమస్యలు రావు కానీ.. పెద్దగా ఉంటే మాత్రం విపరీతమైన నొప్పి కలుగుతుంది.  అయితే ఈ రాళ్లను కరిగించేందకు కొన్ని రకాల జ్యూస్ లు ఎపెక్టీవ్ గా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటే.. 


టొమాటో జ్యూస్ (Tomato juice)

మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో టొమాటో జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రెండు టమోటాలను బాగా కడిగి.. వాటిని గ్రైండ్ చేయండి. అందులో ఉప్పు, మిరియాల పొడిని వేసి బాగా మిక్స్ చేసి కాసేపు ఫ్రిజ్ లో ఉంచండి. ఆ తర్వాత తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 

నిమ్మరసం (Lemon juice)

నిమ్మకాయలో  సిట్రిక్ యాసిడ్ (Citric acid)ఉంటుంది. ఇది రాళ్లను కరిగించడానికి ఎంతో  సహాయపడుతుంది. ఇందుకోసం గిన్నెలో కొంచెం పెరుగును తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 
 

తులసి రసం (Basil juice)

తులసితో తయారు చేసిన జ్యూస్ కూడా కిడ్నీ స్టోన్ సమస్యను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇందుకోసం తులసి ఆకుల రసాన్ని తీసి.. అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం  తీసుకోవాలి. ఇది ఏపూటకు ఆపూట తయారుచేసుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. 

click me!