వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే మెలటోనిన్ (నిద్ర-ప్రేరేపించే హార్మోన్), పాలీఫెనాల్స్, ఫోలేట్, విటమిన్ ఇ ఉన్నాయి, ఇవన్నీ ఆరోగ్యకరమైన మెదడు, గట్‌ను ప్రోత్సహిస్తున్నాయని మునుపటి పరిశోధనలో తేలింది.కనీసం 75 శాతం మానసిక ఆరోగ్య రుగ్మతలు 24 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని ప్రభావితం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పేర్కొంది, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ముఖ్యంగా మానసిక ఆరోగ్య సమస్యలకు గురి చేస్తుంది. కాబట్టి.. పిల్లలు కచ్చితంగా వాల్ నట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.