ఇదొక్కటి వాడితే చాలు.. ముఖంపై ముడతలు, డార్క్ సర్కిల్స్, మచ్చలు, మొటిమలు వంటి సమస్యల్నీ పోతాయి..

First Published Jun 30, 2022, 3:48 PM IST

పసుపు మన ఆరోగ్యానికే కాదు.. చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే ఔషదగుణాలు ముఖంపై ఉండే ముడతలను, నల్లని మచ్చలను, కల్ల చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ ను వదిలిస్తాయి. 

భారతీయ మసాలా దినుసుల్లో ఒకటైన పసుపు ఎంతో ప్రత్యేకమైంది. ఇది వంటలకు రుచిని తీసుకురావడమే కాదు.. మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పసుపును ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తారు. అయినా మనం చేసే ప్రతి వంటలో పసుపు ఖచ్చితంగా ఉంటుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచే గుణాలు పసుపులో ఉంటాయి. అందుకే ఇది సుమారు 4000 సంవత్సరాలుగా ఉపయోగించబడుతూ వస్తోంది. గాయాలను, జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో పసుపు ముందుంటుంది. అంతేకాదు ఈ పసుపు మన చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ నివేదికల ప్రకారం..  Cosmetic surgeon వెల్నెస్,  నిపుణురాలు గీతా గ్రేవాల్ పసుపు చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని తెలియజేశారు. ఇది సూర్యరశ్మి వల్ల ఏరప్పడే మచ్చలను తగ్గిస్తుంది.  పసుపు శరీర చర్మం మొత్తం రంగు ఒకే విధంగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది చర్మ ఆకృతిని కూడా మెరుగుపరుస్తుంది.

పసుపు చర్మ ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇది స్కిన్ టోన్ పొందడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పసుపులో ఫోటోప్రొటెక్టివ్ (Photoprotective)లక్షణాలు ఉంటాయి. ఈ పసుపు చర్మం యొక్క కొల్లాజెన్ విచ్ఛిన్నతను తగ్గిస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో పసుపును నేరుగా చర్మానికి అప్లై చేయకూడదు. ఒకవేళ చేస్తే చర్మంపై అలెర్జీ సమస్యకు దారితీస్తుంది.  అందుకే ముఖానికి అప్లై చేసేముందుగా మీ చేతిపైభాగంలో టెస్ట్ ప్యాచ్ చేయండి. ఒకవేళ మీకు పసుపు అలెర్జీ లేనట్టైతే.. మీ చేతిపై ఎలాంటి మార్పులు రావు.  

చర్మానికి పసుపు వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు: 

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. 

మొటిమల సమస్య ఎక్కువగా ఉండేవారికి చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. పసుపు మొటిమలను చాలా తర్వగా తగ్గిస్తుంది. 

ఇది Dull skin సమస్య నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఇది మీ ముఖాన్ని ప్రకాశవంతంగా తయారుచేస్తుంది. 

Turmeric for health

మొండిగా ఉండే డార్క్ సర్కిల్స్ ను వదిలించడంలో పసుపు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

డార్క్ స్పాట్స్, ఇతర రకాల హైపర్ పిగ్మెంటేషన్ సంకేతాలను తగ్గించడంలో కూడా మెరుగ్గా పనిచేస్తుంది.

Sun tan ను తొలగించడంలో సహాయపడుతుంది. 

చర్మాన్ని స్మూత్ గా అందంగా తయారుచేస్తుంది. 

ఇది మంచి స్కిన్ టోన్ కు సహాయపడుతుంది.

చర్మం గ్లోను ను పెంచడానికి సహాయపడుతుంది.

చిన్న చిన్న అలర్జీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

చర్మం అందంగా మెరవడానికి ఇంట్లోనే మీరు బాత్ పౌడర్ ను తయారుచేసుకోవచ్చు. 

ఇది మాత్రమే కాదు పసుపును కొన్ని వేసవి పానీయాలలో కూడా ఉపయోగించవచ్చు. ఇది రోజంతా మిమ్మల్ని రిఫ్రెష్, శక్తివంతంగా ఉంచుతుంది. అల్లం-పసుపు స్మూతీ, పసుపు ఫ్రూట్ డ్రింక్,  ఆరెంజ్-టర్మరిక్ స్మూతీ కూడా మీరు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

click me!