పైనాపిల్ డైట్ గురించి ఎప్పుడైనా విన్నారా? బరువు తగ్గేందుకు ఎంత ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందో..!

First Published Dec 30, 2022, 1:57 PM IST

నిజానికి పైనాపిల్ కూడా సులువుగా బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతుంది. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి పైనాపిల్ బెస్ట్ ఫుడ్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

pineapple

బరువు తగ్గేందుకు ఒక్కొక్కరూ ఒక్కో ఆహారాలను తీసుకుంటుంటారు. బరువును తగ్గించడంలో వ్యాయామాలు ఎంత ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయో.. ఆహారాలు కూడా అంతే ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. కొన్ని ఆహారాలను తీసుకుంటే బరువు తగ్గడం సులువు అవుతుంది. వీటిలో పైనాపిల్ డైట్ ఒకటి. పండ్లు కూడా తొందరగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఈ పైనాపిల్ డైట్ కేవలం ఐదు రోజుల్లో కొన్ని పౌండ్లను తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

pineapple

పైనాపిల్ డైట్ ప్లాన్ ఎలా పాటించాలి?

పైనాపిల్ డైట్ ను ఫాలో అవుతున్నప్పుడు వారానికి రెండు రోజులు పైనాపిల్ ను తప్ప మరేమీ తినకూడదు. వరుసగా రెండు రోజులు ఈ డైట్ ను ఫాలో అవ్వాలా? వద్దా? అనేది స్పష్టంగా తెలియదు. అయితే  మిగిలిన ఐదు రోజులు మనం మామూలుగానే తింటే సరిపోతుంది.
 

పైనాపిల్ లో ఎన్నో రకాల పోషకాలు, ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి మన శరీరంలో సులువుగా కలిసిపోతాయి. ఇవి జీవక్రియను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే ఇవి శరీరానికి రిఫ్రెష్ గా చేస్తాయి. అందుకే ఈ పైనాపిల్ డైట్ ను తీసుకోవాలని  ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ముఖ్యంగా మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఈ పండును మితంగా తినాలి. దీనివల్ల మీరు అదనపు కిలోలను వేగంగా తగ్గించుకోగలుగుతారు. 
 

పైనాపిల్ డైట్ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది? 

దీనిని వండాల్సిన అవసరం లేదు. 

పైనాపిల్లో బ్రోమెలైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే మీ ప్రేగు కదలికలను మృదువుగా చేస్తుంది. పోషకాహార శోషణను కూడా పెంచుతుంది.

ఇది త్వరగా, సులభంగా బరువు తగ్గించడానికి  సహాయపడుతుంది.

అంతర్గత శుభ్రత, నిర్విషీకరణకు కూడా సహాయపడుతుంది.

దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

అంతేకాదు ఇది మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. 
 

పైనాపిల్ డైట్ దుష్ప్రభావాలు

పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది తీవ్రమైన ఆమ్లతకు దారితీస్తుంది.

పైనాపిల్ లో ఉండే అదనపు ఫైబర్  విరేచనాలకు కారణమవుతుంది.

పైనాపిల్ అలెర్జీ ఉన్నవారు దీనిని తీసుకుంటే.. నోరు, బుగ్గల్లో వాపు వస్తుంది. 

కడుపు పూత, మండుతున్న అనుభూతి కలగొచ్చు. 

అంతేకాదు దీనివల్ల బద్ధకం, బలహీనత, తలనొప్పి, వికారం మొదలైన సమస్యలు కూడా వస్తాయి. 

click me!