అందమైన చర్మానికి.. అవసరమైన విటమిన్లు ఇవే..!

Published : Dec 30, 2022, 12:55 PM IST

కొన్ని రకాల విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఇవి స్కిన్ అందంగా మెరవడానికి సహాయపడతాయి. ఇంతకీ చర్మానికి ఏయే విటమిన్లు అవసరమంటే..   

PREV
16
 అందమైన చర్మానికి.. అవసరమైన విటమిన్లు ఇవే..!

చలికాలంలో చర్మ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ముఖ్యంగా చల్లని వాతావరణానికి చర్మంలోని తేమంతా పోతుంది. దీంతో స్కిన్ పొడిబారుతుంది. అలాగే దురద, చికాకు వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల విటమిన్లు ఎంతో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని కాపాడుకోవడానికి మనం ఆహారంలో విటమిన్లను ఖచ్చితంగా చేర్చాలంటున్నారు నిపుణులు. ఈ విటమిన్లు మన చర్మాన్ని ఎక్కువ కాలం అందంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు చర్మంలోని సెల్యూలార్ రుగ్మతలను త్వరగా నయం చేయడానికి సహాయపడతాయి. ఇందుకోసం మన ఆహారంలో ఉండాల్సిన విటమిన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

విటమిన్ ఎ

విటమిన్ ఎ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అందంగా మారిపోతుంది. ఈ విటమిన్ ఎ మొటిమలను కూడా నివారిస్తుంది. అంతేకాదు చర్మం వృద్ధాప్యాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
 

 

36

విటమిన్ బి 3

విటమిన్ బి 3 హానికరమైన సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఎండలో తిరిగిన తర్వాత చర్మంపై పిగ్మెంటేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే UVA , UVB కిరణాలు చర్మానికి ఎంతో హాని కలిగిస్తాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి మీరు విటమిన్ బి 3  పుష్కలంగా ఉండే  ఆహారాలను మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి.
 

46

విటమిన్ సి

విటమిన్ సి ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ విటమిన్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. అలాగే దెబ్బతిన్న చర్మాన్ని నయం చేయడాన్ని వేగవంతం చేస్తుంది. ఇది చర్మంపై సూర్యరశ్మి తగ్గించడానికి సహాయపడుతుంది కూడా. 
 

56

విటమిన్ ఇ

విటమిన్ ఇ మన చర్మానికి చేసే మేలు అంతా కాదు. ఇది చర్మానికి మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది. అలాగే వృద్ధాప్యం లక్షణాలను నెమ్మదింపజేస్తుంది. అలాగే ఈ విటమిన్ అతి నీలలోహిత కిరణాల నష్టం నుంచి రక్షిస్తుంది. అలాగే చర్మ వాపును నివారిస్తుంది. అంతేకాదు తామర వంటి అనేక చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది. 
 

66

విటమిన్ కె

రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి విటమిన్ కె బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ విటమిన్ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించడానికి సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories