ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ గింజలను, విత్తనాలను మరువకుండా తినండి..

First Published Jan 6, 2023, 3:43 PM IST

బరువు తగ్గడానికి ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బరువును తగ్గించడంలో ఫుడ్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  కొన్ని గింజలు, విత్తనాల్లో కొవ్వులు ఎక్కువగా ఉన్నా అవి మీ బరువును ఏ మాత్రం పెంచవు. నిజానికి ఇవి మీరు సులువుగా బరువు తగ్గడానికి సహాయపడతాయి కూడా. 

బరువు పెరగడం చాలా చాలా సులువు. కానీ తగ్గడమే అంత ఈజీ కాదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ ఫలితం రాదు. బరువును తగ్గించడంలో ఆహారం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఏవి పడితే అవి తినకుండా.. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే  ఆహారాన్ని లిమిట్ లో తింటే మాత్రం మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. గుడ్లు, మాంసం, కాయధాన్యాలు, చిక్పీస్ వంటి వివిధ ఆహారాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ  మీకు ఆరోగ్యకరమైన కొవ్వుల రూపంలో శక్తి అవసరమైనప్పుడు ప్రోటీన్ తో పాటుగా కాయలు, విత్తనాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆకలిని నియంత్రిస్తే మీరు బరువు తగ్గడం షురూ అయినట్టే.. అయితే కొన్ని రకాల గింజలు, విత్తనాలు మీ ఆకలిని తగ్గిస్తాయి. ఇవి మీరు వేగంగా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటంటే.. 
 

వాల్ నట్స్

ప్రోటీన్ కు గొప్ప మూలం వాల్ నట్స్. వీటిలో జీర్ణక్రియను సులభతరం చేయడానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, విటమిన్ 6, ఫోలేట్ లు కూడా పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్ ను తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీ బాడీ ఫిట్ గా ఉంటుంది. వీటిని అలాగే తినొచ్చు. లేదా రాత్రంతా నానబెట్టి కూడా తినొచ్చు. 
 

flax seeds

అవిసె గింజలు

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్డిఎ) డేటా ప్రకారం.. 100 గ్రాముల అవిసె గింజలలో 18 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఈ విత్తనాల్లో అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు మొక్కల ఆధారిత ప్రోటీన్ కు ఇది అద్భుతమైన వనరుగా భావిస్తారు. 
 

బాదం

బాదం మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వీటిని ప్రతి ఒక్కరూ తింటుంటారు. మెదడు ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యంతో సహా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యం బాదం పప్పులకు ఉంటుంది. కానీ చాలా మంది బాదం పప్పులను బరువు తగ్గించడానికి మాత్రం ఉపయోగించరు. ఎందుకంటే  ఇవి బరువును పెంచేస్తాయని. నిజానికి బాదంలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పులను తింటే ఆకలి బాధలు తగ్గుతాయి. కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. 
 

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలు బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్లు కండరాలను నిర్మాణానికి సహాయపడతాయి. 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాల్లో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ విత్తనాలు మీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.  
 

జనపనార విత్తనాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జనపనార విత్తనాలు కూడా బరువును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ జనపనార విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు,  ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6, 9 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. జనపనార విత్తనాలు బరువు తగ్గించడానికి గొప్పగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. 

బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ గుప్పెడు గింజలు, విత్తనాలను తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. వీటిని మోతాదుకు మించి అసలే తినకూడదు. ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం వీటిని తప్పకుండా తినండి. 
 

click me!