ఇందుకే రోజూ ఆకుకూరలను తినాలంటరు..

First Published Dec 16, 2022, 4:54 PM IST

పలు అధ్యయనాల ప్రకారం.. ఆకుకూరల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి వ్యాధికి కారణమయ్యే ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. 
 

మన దేశంలో హార్ట్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. చిన్నవయసు వారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆకు కూరలు. పలు అధ్యయనాల ప్రకారం.. రెగ్యులర్ గా ఆకు కూరలను తినడం వల్ల గుండె జబ్బులు వంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

ఆకు కూరలు బరువు తగ్గడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి. పాలకూర, బచ్చలికూర, బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే, క్యాబేజీ వంటి కూరగాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. 
 

leafy vegetables

 ఈ ఆకుకూరల ద్వారా మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు అందుతాయి. ఆకుకూరల్లో వ్యాధి నివారణ, శరీర ప్రక్రియలకు తోడ్పడే పోషకాలు కూడా ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆకుకూరల్లో ఉండే గ్లూకోసినోలేట్లలో శక్తివంతమైన శోథ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇవి మన కణాలను వ్యాధి కారకాల నుంచి రక్షిస్తాయి. ఆకు కూరల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

న్యూ ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం (ఇసియు) పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను రోజూ తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గిస్తుందని కనుగొన్నారు. ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అభిజ్ఞా ఆరోగ్యాన్ని కాపాడటానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాల్ని తగ్గించడం వంటి అనేక జీవ ప్రక్రియలకు ఈ మంచి కొవ్వులు చాలా చాలా అవసరం. 
 

ఆకుకూరల్లో ఉండే పోషక విలువలు డయాబెటిస్, ఉబ్బసం, అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధకులు కనుగొన్నారు. పలు అధ్యయనాల ప్రకారం.. ఈ కూరగాయలలోని మొక్కల ఆధారిత అంశాలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తతాయి. 

green leafy vegetables

పరిశోధనల ప్రకారం.. రోజూ 30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల డయాబెటిస్, ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇది మీరు ఫాస్ట్ గా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. పండ్లు,  కూరగాయలు అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో ఉండే  గ్లూకోసినోలేట్స్ ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. మీ కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉన్నప్పుడు ధమనులు హృదయ సంబంధ సమస్యలు,  స్ట్రోక్ కు కారణమయ్యే కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. 

leafy vegetables

ఆకు కూరల్లో గ్లూకోసినోలేట్స్ అని పిలువబడే పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాటానికి సహాయపడతాయి. ఆకు కూరలను తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా రొమ్ము, ప్యాంక్రియాటిక్, మూత్రాశయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో ఉండే కొన్ని ఎంజైమ్లు కణాలకు డిఎన్ఎ నష్టాన్ని నివారించడానికి సహాయపడతాయి. 

click me!