ఎయిడ్స్ కు ఈ అలవాట్లే కారణం.. ఈ తప్పులు చేయకండి

First Published Dec 1, 2022, 5:05 PM IST

ఎయిడ్స్ పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తుంది. కారణం.. ఇది ఒక మనిషిని ఎన్నో విధాలుగా దెబ్బతీసి చివరకు ప్రాణాలను తీస్తుందని. ప్రమాదకరమైనన ఎయిడ్స్ రోగానికి దూరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

world aids day

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 1 న జరుపుకుంటారు. హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుకుంటారు. పిల్లలకు, ప్రజలకు అవసరమైన హెచ్ఐవి సేవలను అందించడం ద్వారా ఎయిడ్స్ ను నిర్మూలించడమే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2022 ఇతివృత్తం. ఈ సందర్భంగా ఎయిడ్స్ కు సంబంధించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తిలో కనిపించే లక్షణాలను

హెచ్ఐవి సంక్రమణ చివరి దశనే ఎయిడ్స్ అంటారు. జ్వరం, శోషరస కణుపులు వాపు, ఎక్కువ అలసట, రాత్రిపూట అధికంగా చెమట పట్టడం, నోరు, నాలుక లేదా పురీషనాళంలో పుండ్లు, చర్మ సంక్రామ్యత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎయిడ్స్ రోగి ఎన్ని రోజులు బతుకుతాడు? 

మనందరికీ తెలుసు..  హెచ్ఐవికి సరైన ఔషధం గాని, ఖచ్చితమైన చికిత్స గానీ లేదు. ఎయిడ్స్ గుర్తించబడిన తర్వాత  రోగి ఆయుర్దాయం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దీని అర్థం ఎయిడ్స్ ప్రారంభమైన తర్వాత రోగి గరిష్టంగా మూడేండ్లే బతుకుతాడన్న మాట. 

ఎయిడ్స్ కు దారితీసే అలవాట్లు

అసురక్షితమైన సెక్స్

ఎయిడ్స్ ఉన్న వ్యక్తిని ప్రతి ఒక్కరూ చిన్నచూపు చూస్తారు. అందుకే ఎయిడ్స్ ను నిరోధించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎయిడ్స్ కు ప్రధాన కారణం అసురక్షితమైన సెక్స్. ఒకరితో కాకుండా ఎక్కువ మంది భాగస్వాములు ఉన్న వ్యక్తులు మాత్రమే కాకుండా.. ఒకే భాగస్వామితో అసురక్షిత లైంగిక సంబంధం కలిగి ఉన్న వ్యక్తికి కూడా ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. యోని సంభోగం లేదా ఓరల్ సెక్స్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హెచ్ ఐవి పాజిటివ్ వచ్చిన వ్యక్తితో మీరు పదేపదే అసురక్షిత రతిలో పాల్గొంటే మీరు ఖచ్చితంగా ఎయిడ్స్ బారిన పడతారు. 
 

నాసిరకం కండోమ్ వాడకం

శారీరక సంబంధం కలిగి ఉన్నప్పుడు కండోమ్ నాణ్యతను చెక్ చేయడం చాలా ముఖ్యం. నాణ్యతలేని కండోమ్లు సంక్రమణ వ్యాప్తి చెందడానికి కారణమవుతాయి. సెక్స్ సమయంలో కండోమ్లు చిరిగిపోవడం వల్ల హెచ్ ఐవి వచ్చే అవకాశం ఉంది. 

పచ్చబొట్టు వేయించుకోవడం

పచ్చబొట్లు వేయించుకోవడం ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ గా మారింది. కొంతమంది శాశ్వతంగా చెరిగిపోని పచ్చబొట్లను పొడిపించుకుంటారు. కానీ ఈ పచ్చబొట్లను వేయించుకోవడం వల్ల  కూడా ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకరు ఉపయోగించిన సూదిని మరొకరికి ఉపయోగించడం వల్ల ఎయిడ్స్ వస్తుంది.హెచ్ఐవి అనేది ఒక అంటువ్యాధి. ఎయిడ్స్ ఉన్న వ్యక్తికి ఉపయోగించిన సూది ద్వారా వ్యాప్తి చెందుతుంది.
 


రక్తం ఎక్కించుకోవడం

చాలా సందర్భాల్లో ఒకరి రక్తాన్ని ఎక్కించుకోవాల్సి ఉంటుంది. కానీ రక్తం ద్వారా కూడా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ఎయిడ్స్ సోకిన వాళ్ల రక్తాన్ని ఎక్కించుకునే ప్రమాదం ఉంది. అందుకే  నమ్మదగిన ఆసుపత్రి లేదా వైద్యుడి సహాయం తీసుకోండి. ఒకవేళ ఎయిడ్స్ సోకిన రక్తం మీ శరీరంలోకి వెళితే.. తేలికగా HIVకి గురవుతారు. రక్తం ఎక్కించుకోవడానికి ముందు దీనిని చెక్ చేయించండి.
 

వివాహానికి ముందు ఈ పరీక్ష

మీరు పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొన్నా..  లేకున్నా వివాహానికి ముందు ఇద్దరూ హెచ్ ఐవి పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇది ఒక నిశ్శబ్ద వ్యాధి. ఇది మీకు తెలియకుండానే మిమ్మల్ని చంపుతుంది. పెళ్లికి ముందే పరీక్షలు చేయించుకుంటే.. వచ్చే ప్రమాదాల్ని దూరం చేసుకోవచ్చు.

click me!