20 ఏండ్లలో అంగస్తంభన లోపం.. కారణాలు ఇవే.. !

First Published Dec 2, 2022, 9:58 AM IST

ఒకప్పుడు అంగస్తంభన లోపం పెద్దవారిలోనే వచ్చేది. ఇప్పుడు 20 ఏండ్ల యువకులు కూడా అంగస్తంభన లోపంతో  ఇబ్బందిపడుతున్నారు. ఈ అంగస్తంభన లోపానికి కారకాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే.. 
 

అంగస్తంభనను పొందడానికి, సెక్స్ కోసం తగినంత దృఢంగా ఉంచడానికి పురుషాంగం తగినంత రక్తాన్ని పొందలేని పరిస్థితినే అంగస్తంభన లోపం అంటారు. అంటే దీనిలో పురుషాంగం గట్టిపడదు. దీన్నే నపుంసకత్వమని అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ అంగస్తంభన లోపం సమస్య తలెత్తుతుంది. నిజానికి ఈ సమస్య వృద్ధులకు మాత్రమే వస్తుందని చాలా మంది అనుకుంటారు. చిన్న వయసులో ఉన్న మగవారిలో కూడా ఈ సమస్య రావొచ్చంటున్నారు నిపుణులు. 

కొన్ని అంచనాల ప్రకారం.. 20 నుంచి 29 ఏండ్లున్న పురుషులలో 8 శాతం మంది అంగస్తంభన లోపం సమస్యతో బాధపడుతున్నారట. ఇది 30 నుంచి 39 ఏండ్ల వయుసులో 11 శాతం పురుషులను ప్రభావితం చేస్తుందట. 20 ఏడ్లున్న పురుషుల్లో కూడా అంగస్తంభన లోపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

హార్మోన్ల రుగ్మతలు

అంగస్తంభన లోపానికి హార్మోన్లు కూడా ఒక కారణమే. వాటిలో హెచ్చుతగ్గులు వస్తే అంగస్తంభన లోపానికి దారితీస్తుంది. టెస్టోస్టెరాన్ దీనికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. టెస్టోస్టెరాన్ తక్కువ స్థాయిలో ఉత్పత్తి కావడం వల్ల సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. అంగస్తంభన లోపం కూడా జరుగుతుంది. 

మరొక హార్మోన్ ప్రోలాక్టిన్ కూడా అంగస్తంభన లోపానికి దారితీస్తుంది. ఈ హార్మోన్ పిట్యూటరీ గ్రంథి ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రోలాక్టిన్ స్థాయిలు పెరగడం వల్ల వయసుతో సంబంధం లేకుండా అంగస్తంభనకు దారితీస్తుంది. 

థైరాయిడ్ స్థాయిలు ఎక్కువగా పెరిగినా.. మరీ తక్కువగా అయినా కూడా అంగస్తంభన లోపానికి దారితీస్తుంది.
 

డయాబెటీస్

డయాబెటీస్ సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించడమే కాదు.. అంగస్తంభన లోపానికి కూడా కారణమవుతుంది. మధుమేహం కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల మీ శరీర రక్తనాళాలు దెబ్బతింటాయి. అంగస్తంభన కణజాలానికి రక్తాన్ని తీసుకెళ్లే వాటితో సహా డయాబెటీస్ పురుషాంగం లోపల ఉన్న నరాలను, దాని చుట్టూ ఉన్న నరాలను కూడా ప్రభావితం చేస్తుంది. 
 

స్మోకింగ్

స్మోకింగ్ కూడా సంగస్తంభన లోపానికి దారితీస్తుంది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ మొత్తం శరీరంలో రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా లేకపోతే అంగస్తంభన లోపంతో పాటుగా గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. 
 

డిప్రెషన్

మెదడు వల్లే సెక్స్ పై కోరికలు పుడతాయి. అయితే డిప్రెషన్ తో బాధపడుతున్న వారిలో మెదడు రసాయనాలలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. డిప్రెషన్ లోల ఉన్న పురుషుల్లో అంగస్తంభన లోపం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీ డిప్రెసెంట్స్ లేదా  డిప్రెషన్ మందులు కూడా అంగస్తంభన లోపానికి దారితీస్తాయి. అలాగే స్ఖలనం పొందడం కష్టంగా మారుతుంది. 

Does size of penis really matter for physical pleasure

లైంగిక పనితీరులో ఆందోళన

చాలా మంది యువకులు 20 ఏండ్ల వయసులో లైంగిక పనితీరు ఆందోళనతో ఇబ్బందిపడుతున్నారట. రూపం గురించి ఆందోళన చెందడం లేదా  భాగస్వామిని సంతోషపెట్టే సామర్థ్యం ఉందా? అనే విషయాలు వంటి పలు కారణాల వల్ల అంగస్తంభన లోపం ఏర్పడుతుంది. ఒత్తిడి ఎక్కువైతే కూడా అంగస్తంభన పొందడం కష్టమవుతుంది. 2005 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకరాం.. ఆందోళన వల్ల పురుషుల్లో, మహిళలు ఇద్దరిలో లైంగిక సామర్థ్యం తగ్గుతుందట. 
 

click me!