Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులను అసలే చేయకండి..

Published : Jul 19, 2022, 12:52 PM IST

Weight Loss Tips: బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటారు. అయితే మీరు చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే మీరు బరువు తగ్గకుండా చేస్తాయి.   

PREV
16
 Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులను అసలే చేయకండి..

కొంతమంది బరువు తగ్గడానికి కఠినమైన డైట్ ను ఫాలో అవుతూ.. రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తుంటారు. అయినా బరువు మాత్రం ఇంతైనా తగ్గరు. నిజానికి ఇలా బరువు తగ్గకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. తెలిసీ.. తెలియక మీరు చేసే పొరపాట్లే మిమ్మల్ని బరువు తగ్గకుండా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

తగినంద నిద్ర లేకపోవడం

కంటికి సరిపడా నిద్రలేకుంటే కూడా బరువు తగ్గడం కష్టమవుతుంది. రోజుకు 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోతే మీ శరీరానికి శక్తి లభిస్తుంది. లేదంటే శరీరం అలసటగానే ఉంటుంది. దీంతో మీరు సరిగ్గా వ్యాయామం కూడా చేయలేరు. ముఖ్యంగా తక్కువ నిద్ర ఆహారపు అలవాట్లను మారుస్తుంది. రాత్రుళ్లు లేట్ పడుకునే, తక్కువగా నిద్రపోయే వారు శరీరంలో కొవ్వును పెంచే ఆహారాలను ఎక్కువగా తింటారు. ఇది మీ బరువును మరింత పెంచుతుంది. అందుకే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్రపోండి. 

36

వ్యాయామం ఓవర్ గా చేయడం

వ్యాయామంతోనే మన శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. అందుకే చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామాలను చేస్తుంటారు. వ్యాయామం చేయడం మంచి విషయమే కానీ.. ఎవరు ఎంత సేపు వ్యాయామం చేయాలి. ఏవి చేయాలి అన్న అవగాహన చాలా అవసరం. ఏ చిన్నపొరపాటు జరిగినా.. ఎంతో నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అందుకే ఏ వయసు వారు ఎంత సమయం వ్యాయామం చేయాలో తెలుసుకోవాలి. అందుకే నిపుణుల సలహా తీసుకుని వ్యాయామాలను చేయాలని నిపుణులు సలహానిస్తున్నారు.  

46


పోషకాహారం

చాలా మంది బరువు తగ్గాలని పూర్తిగా తినడమే మానేస్తుంటారు. ఏదో ఒక్కపూటో, రెండు పూటలో తింటుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచి పద్దతి కాదు. తినడం మానేస్తే బరువు తగ్గుతారన్న దాంట్లో వాస్తవం లేదు. ఇలా ఆహారాన్ని తీసుకోవడం మానేయడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఇది శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే టైం టూ టైం తినండి. లిమిట్ లో. మీరు తినే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే చాలా తర్వగా కడుపు నిండుతుంది. ఇది మీ ఆకలిని కూడా నియంత్రణలో ఉంచుతుంది. మొత్తంగా బరువు తగ్గాలని తినడం మానేయకండి. వీలైనంత ఎక్కువగా పోషకాహారం తీసుకోండి. 

56

నీళ్లను తక్కువగా తాగడం

నీళ్లను వీలైనంత ఎక్కువగా తాగితే బరువు తగ్గే ప్రాసెస్ వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి నీళ్లను శరీరానికి సరిపడా తాగితే బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. దీనివల్ల ఎన్నో రోగాలు తగ్గుతాయి. నిజానికి నీళ్లను ఎక్కువగా తాగితే ఆహారాన్ని తక్కువగా తీసుకోగలుగుతారు. నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. జీర్ణప్రక్రియ కూడా మరమ్మత్తు చేయబడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు నీళ్లను పుష్కలంగా తాగండి. 
 

66

క్యాన్డ్ ఫుడ్ (Canned food)

శరీరంలో కొవ్వును తగ్గించుకోవాలనుకునే వారు క్యాన్డ్ ఫుడ్ కూ దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇది బరువు తగ్గడానికి బదులుగా విపరీతంగా పెంచుతుంది. ఈ ఆహారాల్లో షుగర్, ఉప్పు , ప్రిజర్వేటివ్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవేకాదు వీటిలో అనేకరమైన హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరాన్నిదెబ్బతీస్తాయి. అందుకే ఆకలిగా అనిపిస్తే క్యాన్డ్ ఫుడ్ కు బదులుగా పండ్లను తినండి. 
 

Read more Photos on
click me!

Recommended Stories