జాగ్రత్త.. ఆల్కహాలే కాదు.. ఇవి కూడా మీ కాలెయాన్ని దెబ్బతీస్తాయి..

Published : Jul 19, 2022, 11:50 AM IST

మద్యం ఎక్కువగా తాగితేనే కాలెయం దెబ్బతింటుందని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి మద్యం ఒక్కటే కాదు.. చక్కెర, విటమిన్ ఎ, పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా.. కాలెయం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

PREV
16
జాగ్రత్త.. ఆల్కహాలే కాదు.. ఇవి కూడా మీ కాలెయాన్ని దెబ్బతీస్తాయి..

శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంలో కాలెయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే కొంతమంది మితిమీరి ఆల్కహాల్ ను తాగి కాలెయాన్ని దెబ్బతీస్తున్నారు.  ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే.. ఆల్కహాల్ ఒక్కటే కాదు.. తెలిసీ తెలియక చేసిన తప్పుల వల్ల కూడా కాలెయం దెబ్బతింటుంది.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26

చక్కెర (Sugar)

చక్కెర శరీరానికి అవసరమే అయినప్పటికీ.. దీన్ని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో నష్టం జరుగుతుంది. దీనివాడకం వల్ల దంతాలతో పాటుగా కాలెయం కూడా దెబ్బతింటుంది. శుద్ధి చేసిన చక్కెరను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కాలెయ వ్యాధి ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర కాలెయాన్ని ప్రమాదంలో పడేస్తుందని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. 
 

36

విటమిన్ ఎ అధికంగా తీసుకున్నా

మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వాటిలో ఒకటి విటమిన్ ఎ ఒకటి. ఇది తాజా పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. పసుపు, ఎరుపు నారింజ పండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. అయితే కొంతమంది విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడంతో పాటుగా విటమిన్ ఎ సప్లిమెంట్లను కూడా తీసుకుంటుంటారు. కానీ వీటిని తీసుకోవడం వల్ల కాలెయ వ్యాధి వస్తుంది. అందుకే విటమిన్ ఎ సప్లిమెంట్లను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి. 

46

పిండి: తెల్లగా ఉండే పిండి ఎక్కువగా ప్రాసెస్ చేయబడి ఉంటుంది. దీనిలో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేయబడ్డ  తెల్లని పిండి రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. అందుకే వైట్ బ్రెడ్, పిజ్జా, బిస్కెట్లను వీలైనంత తక్కువగా తినాలి. ఇవి కాలెయానికి అంత మంచివి కావు. ఎందుకంటే ఇవన్నీ ప్రాసెస్ చేయబడ్డ తెల్ల పిండితోనే తయారుచేయబడతాయి. 

56

రెడ్ మీట్ (Red meat)

రెడ్ మీట్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది అంత సులువుగా జీర్ణం కాదు. వాస్తవానికి ప్రోటీన్లను విచ్చిన్నం చేయడం కాలెయానికి అంత సులువు కావు. దీనివల్ల కూడా కాలెయ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. 
 

66
pain killer

పెయిన్ కిల్లర్ (Pain killer)

తలనొప్పి, శరీర నొప్పులు ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని ఎక్కువ మొత్తంలో ఉపయోగించడం వల్ల కాలెయంపై చెడు ప్రభావం పడుతుంది. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను అధిక మొత్తంలో తీసుకుంటే కాలెయం దెబ్బతింటుంది. అందుకే వీటిని తీసుకునే ముందు డాక్టర్ ను సంప్రదించండి. 
 

click me!

Recommended Stories