Weight loss: ఫాస్ట్ గా బరువు తగ్గాలంటే ఈ ఆయుర్వేద మూలికలను ట్రై చేయాల్సిందే..!

Published : May 21, 2022, 09:43 AM IST

Weight loss: బరువు తగ్గడానికి ఎన్నో  మార్గాలున్నాయి. అందులోనూ ప్రతి వంటింట్లో ఖచ్చితంగా  ఉండే కొన్ని ఆయుర్వేద మూలికలతో సులభంగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. 

PREV
18
Weight loss: ఫాస్ట్ గా బరువు తగ్గాలంటే ఈ ఆయుర్వేద మూలికలను ట్రై చేయాల్సిందే..!

Weight loss: ఈ రోజుల్లో అధిక బరువు బారిన  పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇక వీళ్లు బరువు తగ్గేందుకు అనేక మార్గాలున్నాయి. వ్యాయామం చేసినా.. ఆహారంలో మార్పులు చేసుకున్నా సులభంగా బరువును కోల్పోవచ్చు. 
 

28

కానీ బరువు తగ్గే ప్రాసెస్  మాత్రం నెమ్మదిగానే సాగుతుంది. రాత్రికి రాత్రి కిలోల బరువు తగ్గడం అనేది అసాధ్క్ష్యమే. కాబట్టి కొన్ని రోజుల్లోనే బరువు తగ్గుతారు ఇలా చేయండి అన్న మాటలను మాత్రం నమ్మకండి.  బరువు తగ్గేందుకు మీరు ప్రతిరోజూ ప్రయత్నించాల్సి ఉంటుంది. ఏదో ఒక రోజు చిట్కాలో లేకపోతే వ్యాయామమో చేస్తే అస్సలు బరువు తగ్గరు. 

38

అయితే బరువు నిర్వాణలో ఆయుర్వేదానికి ప్రత్యేక పాత్ర ఉంది. ఆయుర్వేదం ఒక గొప్ప సాంప్రదాయం. అలాగే ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో రోగాలను నయం చేసుకుంటూ వస్తోంది. అయితే బరువు తగ్గేందుకు కొన్ని ఆయుర్వేద మూలికలు బాగా ఉపయోగపడతాయి. ఇంతకు వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలాంటి ఆయుర్వేద మూలికలను తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. 

48

పసుపు.. చిటికెడు పసుపు లేకుండా మన దేశంలో వంటకం కూడా పూర్తి కాదు. ఈ పసుపు ప్రతి వంట గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన మూలకం కూడా. ఇది బరువును తగ్గించే లక్షణాలను సైతం కలిగి ఉంటుంది. పసుపు శరీర జీవక్రియను పెంచుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారకి ఇది దివ్య ఔషదం లాంటిది. ఇందులో యాంటీయాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 

పసుపును మీ రోజు వంటల ద్వారా తీసుకోవడంతో పాటుగా ఇతర పద్దతుల ద్వారా కూడా పసుపును తీసుకోవచ్చు. ఇందుకోసం గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో కాస్త పసుపు, నల్ల మిరియాలను కలిపి తీసుకోండి. నీళ్లకు బదులుగా పాలను కూడా తీసుకోవచ్చు. దీనిని పడుకునే ముందు తీసుకోవాల్సి ఉంటుంది. 

58

జీలకర్ర.. బరువు తగ్గడానికి జీలకర్ర వాటర్ బాగా ఉపయోగాపడుతుందని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ జీలకర్రను  ప్రతి భారతీయ వంటకాల్లో టెంపరింగ్ ఎలిమెంట్ గా విరివిగా ఉపయోగిస్తారు. 

జీలకర్రలో జీవక్రియను ప్రేరేపించే మూలకాలు ఉన్నాయి.  ఇది జీర్ఱక్రియకు ఆరోగ్యానికి కూడా సహాయపడుతతుంది. జీలకర్ర కడుపు ఉబ్బరాన్ని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇక బరువు తగ్గడం కోసం జీలకర్రను నీటిలో నానబెట్టి ఉదయాన్ని పరిగడుపున తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. 

 

68

మిరియాలు.. భారతదేశానికి చెందిన అనేక సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు ఒకటి. ఇవి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. ఘాటుగా ఉండే నల్ల మిరియాలకు కొవ్వును కరిగించే లక్షణాలు ఉంటాయి. 

ఒక పరిశోధన ప్రకారం.. నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ అనే మూలకం కొత్త కొవ్వు కణాలను ఏర్పడటానికి కారణమయ్యే జన్యువుల కార్యకలాపాలకు అడ్డుగా నిలుస్తుంది. అంతేకాదు ఇది  శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సైతం కరిగిస్తుందని తేలింది. 

78

దాల్చిన చెక్క.. మంచి సువాసన కలిగి ఉండే దాల్చిన చెక్క బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం కూడా చేస్తుంది. దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. తినాలి అన్న కోరికలను కూడా తగ్గిస్తుంది. 

ఈ దాల్చిన చెక్కను వివిధ మార్గాల ద్వారా తీసుకోవచ్చు. మీరు రోజూ తాగే టీ లో కూడా వేసుకుని తీసుకోవచ్చు. లేదా దాల్చిన చెక్క చిన్న ముక్కను కూడా నమలొచ్చు. ఇది తియ్యగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. 

88

అల్లం..  అల్లం టీ తో రోజును ప్రారంభించేవాళ్లు చాలా మందే ఉన్నారు. అల్లం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే ఆకలిని తగ్గిస్తుంది. ఇది మీ బరువు తగ్గడానికి చక్కటి మెడిసిన్ లాంటిదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పలు అధ్యయనాల ప్రకారం.. క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది . కేలరీలు కూడా బర్న్ అవుతాయి. అంతేకాదు ఇది శరీర వేడిని కూడా పెంచుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories