Raw mango: వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లకు ఏ కొదవా ఉండదు. అందులోనూ మార్కెట్ లో ఎన్నో రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయి. వేసవిలో పుష్కలంగా లభించే మామిడి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలా అని ఓవర్ గా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
28
ఈ సీజన్ పోతే మళ్లీ దొరకవని ఆగమయ్యి.. దొరికిందే తడవుగా మామిడి పండ్లను మోతాదుకు మించి తింటే మాత్రం ఒంట్లో వేడి విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.
38
మామిడి పండ్లే కాదు పచ్చి మామిడి కాయలు తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులోనూ గర్భిణులు పచ్చి మామిడి కాయలను ఇష్టంగా తింటుంటారు. పచ్చిమామిడి కాయలను ముక్కలుగా కోసి వాటిపై కాస్త ఉప్పు, కారం వేసుకుని తింటుంటే వచ్చే ఆ మజాను మాటల్లో చెప్పలేం కదా.
48
ఇకపోతే పచ్చి మామిడికాయలో విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇందులో కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
58
వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే వడదెబ్బ తగలకుండా మనల్ని కాపాడుతుంది. ఇక ఎండాకాలంలో వచ్చే ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.
68
mango
ఇకపోతే పచ్చిమామిడి కాయలు కాలెయ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. వీటిని తరచుగా తింటే కాలెయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను ను తగ్గించేందుకు కూడా ఇవి సహాయపడతాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.
78
పచ్చి మామిడిలో ఫైబర్ క్వాంటిటి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు అధనంగా ఫుడ్ ను తీసుకోలేరు. తద్వారా మీ బరువు తగ్గే ప్రాసెస్ సులువు అవుతుంది.
88
అయితే ఈ పచ్చిమామిడి కాయలకు కడుపు నొప్పి సమస్య ఉన్నవాళ్లు దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే ఇది ఈ సమస్యను మరింత పెంచుతుంది. వాంతులు, గొంతునొప్పి, దురద వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది