వెయిట్ లాస్ : కొవ్వు తగ్గిస్తున్నారా? కండలు కరిగిస్తున్నారా?

First Published Sep 28, 2021, 3:43 PM IST

చాలా ఫిట్ నెస్ రెజిమీస్ కొవ్వును బర్న్ చేస్తాయన్న సాకుతో కండరాల్ని కరిగిస్తాయి. దీనివల్ల చాలామంది కొవ్వుకు బదులుగా మజిల్ మాస్ ను కోల్పోతారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

ఆరోగ్యకరమైన బరువు తగ్గడం అంటే శరీరం నుండి అదనపు కొవ్వును కోల్పోవడం, మజిల్ మాస్ ను పెంచుకోవడం. సన్నని కండరంతో కొవ్వును భర్తీ చేయడం వలన మీరు మరింత బిగువుగా, దృఢంగా, ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ కొవ్వుతో వచ్చిన బరువును తగ్గించుకోవాలంటే.. కేవలం ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయడం వల్ల మాత్రమే సాధ్యం కాదు. 

చాలా ఫిట్ నెస్ రెజిమీస్ కొవ్వును బర్న్ చేస్తాయన్న సాకుతో కండరాల్ని కరిగిస్తాయి. దీనివల్ల చాలామంది కొవ్వుకు బదులుగా మజిల్ మాస్ ను కోల్పోతారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

కిలోలు కొద్దీ బరువు తగ్గాలనుకున్నప్పుడు.. మనం పాటించే పద్ధతుల వల్ల శరీరం మొదట కండర ద్రవ్యరాశిని కోల్పోదు. అయితే క్రాష్ డైట్ పాటించినప్పుడు, కరెక్ట్ కాని వ్యాయామాలను పాటించినప్పుడు మాత్రమే, మన శరీరం కండర ద్రవ్యరాశిని కోల్పోవడం ప్రారంభిస్తుంది. అయితే, మీ తగ్గుతున్న బరువు కొవ్వుతగ్గడం వల్లన లేదా కండర ద్రవ్యరాశిని కోల్పోవడం వల్లన అని చెప్పడం పెద్ద కష్టమైన విషయం  ఏమీ కాదు. కొన్ని సూచనలు గమనిస్తే అది ఈజీగా కనిపెట్టొచ్చు. తద్వారా లావు తగ్గడానికి మీ ఆహారంలో సులభంగా మార్పులు చేయవచ్చు. మీరు కొవ్వుకు బదులుగా కండర ద్రవ్యరాశిని కోల్పోతున్నారని తెలిపే కొన్ని సంకేతాలు చూడండి.. 

వేగంగా బరువు తగ్గుతుంటే...కొవ్వు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. అదే సమయంలో కండర ద్రవ్యరాశిని కోల్పోవడం చాలా సులభం. మీ వెయిటింగ్ మెషీన్‌లో స్కేల్ త్వరగా తగ్గుతోందని గమనిస్తే, కొవ్వుకు బదులుగా మీరు కండర ద్రవ్యరాశిని కోల్పోతున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎంత వేగంగా బరువు తగ్గుతారో.. అంతే వేగంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కొవ్వు తగ్గడం అనేది నీటి బరువు, కండర ద్రవ్యరాశి తగ్గడం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. 

అలసటగా ఉంటారు...  ఆరోగ్యంగా తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం, ఒత్తిడి స్థాయిని నిర్వహించగలిగినప్పుడు అలసటగా అనిపించడానికి ఎటువంటి కారణాలు లేవు. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరించిన తర్వాత కూడా, బరువు తగ్గడానికి అవసరమైన, మీరు రోజువారీ కార్యకలాపాలు చేసిన తర్వాత అలసటగా అనిపిస్తే, మీ కొవ్వు తగ్గించే దినచర్యలో ఏదో తప్పు ఉందని అర్థం. మీరు దీనికి అవసరమైన మార్పులను చేయవలసి ఉంటుంది.

ఫాట్ లాస్ డైట్ ముఖ్య ఉద్దేశం శరీరంలోని కొవ్వును కరిగించడం. ఈ రొటీన్ రిలీజియస్లీ పాటిస్తున్నట్లైతే.. కొవ్వు కరగడాన్ని గుర్తించొచ్చు. ఒక నెలలోనే ఈ మార్పు కనిపిసస్తుంది. నెలరోజుల్లో మీ శరీర కొవ్వు శాతం పెరగకపోతే, మీరు కొవ్వుకు బదులుగా కండర ద్రవ్యరాశిని కోల్పోతున్నారని ఇది సూచిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును అంచనా వేయడానికిమీరు బాదీ పించింగ్ పద్దతిని పాటించొచ్చు. కొలతలు, స్కేల్‌ లతో మీకు ఖచ్చితమైన లెక్క తేలదు.

కండర ద్రవ్యరాశి కోల్పోవడం అంటే శక్తి కోల్పోవడం, ఇది మీ మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మానసిక కల్లోలం, ఒత్తిడి, చిరాకు రకరాలుగా పెరుగుతుంటాయి. అంతే కాకుండా, మీరు కూడా మైకం, చిరాకు అనుభూతి చెందవచ్చు. ఎందుకంటే మన మెదడు శరీరంలోని అన్ని కండరాలకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెబుతుంది. శరీరం అలసిపోయినప్పుడు, శక్తి నిల్వ తక్కువగా ఉన్నప్పుడు, మీ మెదడు సమర్థవంతంగా పనిచేయదు. దీంతో మీ మానసిక స్థితి దెబ్బతింటుంది.

click me!