చలికాలంలో ఈ సీజనల్ ఫుడ్స్ ను తింటే మీ బరువు బాగా తగ్గుతుంది..

First Published Jan 16, 2023, 1:01 PM IST

అనుకుంటే కానిది ఏదీ లేదు. అది బరువైనా సరే.. అవును మీరు కొద్దిగా కష్టపడితే చాలు వీలైనంత తొందరగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా సీజనల్ కూరగాయలు బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 
 

చలికాలంలో మన శారీరక శ్రమ చాలా వరకు తగ్గుతుంది. చల్లని గాలుల వల్ల చాలా మంది బయటకు వెళ్లరు. వ్యాయామాలు అసలే చేయరు. దీనికి తోడు చల్లని వాతావరణంలో వేడి వేడి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ లనే ఎక్కువగా తింటుంటారు. ఇలాంటి ఆహారాల వల్ల బరువు బాగా పెరిగిపోతారు. ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో సీజనల్ కూరగాయలను, తింటే సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

క్యారెట్లు

క్యారెట్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. చలికాలంలో క్యారెట్ హల్వాను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. క్యారెట్లలో సహజంగా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్బుతమైన ఆహారమనే చెప్పాలి.  క్యారెట్ లో ఫైబర్ తో పాటుగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి.
 

ముల్లంగి

ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంతేకాదు దీనిలో ఫైబర్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గాలనుకునేవారి సరైన ఆహారంగా పరిగణిస్తారు. క్యారెట్ లో మాదిరిగానే ముల్లంగిలో కూడా కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. చలికాలంలో ముల్లంగిని ఎన్నో విధాలుగా వండుతారు. ముల్లండి పరాఠా, సింపుల్ ముల్లంగి, టమోటా కూర అంటూ రకరకాల వంటల్లో వేస్తుంటారు. అయినా చలికాలంలో వీలైనంత ఎక్కువ ముల్లంగి తినాలి.
 

వేరుశెనగ

చలికాలంలో వేరుశెనగలను తప్పకుండా తినాలి. రోజూ గుప్పెడు వేరుశెనగలను తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. గుప్పెడు వేరుశెనగలు మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. ఇవి మీ ఆకలిని తగ్గిస్తాయి కూడా. కొవ్వు అధికంగా ఉన్నప్పటికీ వేరుశెనగను మితంగా తింటే మీరు సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.  చలికాలంలో బెల్లం, వేరుశెనగలను ఉపయోగించి ఎన్నో వంటకాలను తయారు చేస్తారు. 
 

చిలగడదుంపలు

ఒక గిన్నె కాల్చిన చిలగడదుంపలను తింటే మీ శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. చిలగడదుంపలు బరువును చాలా సులువుగా తగ్గించడానికి సహాయపడతాయి. ఒక వేళ మీరు డయాబెటీస్ పేషెంట్ అయితే డాక్టర్ సలహా తీసుకుని వీటిని తినండి. చాలా మంది ఆరోగ్య నిపుణులు మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి బంగాళాదుంపలు తినాలని సూచిస్తుంటారు. నిజానికి చిలగడదుంపలను తినడం చాలా సులభం. సాధారణ బంగాళాదుంపల కంటే చాలా భిన్నంగా, రుచిగా ఉంటాయి.
 

beet root

బీట్ రూట్

బీట్ రూట్ లో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిర్విషీకరణ లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ లక్షణాలున్న బీట్ రూట్ బరువు తగ్గడానికి  ఎంతగానో సహాయపడుతుంది. ఎరుపు వర్ణద్రవ్యం కూడా దీనిని ప్రత్యేకమైన కూరగాయలలో ఒకటిగా చేస్తుంది. బీట్ రూట్ ను పచ్చిగా తినొచ్చు లేదా వండుకోవచ్చు. దీన్ని పెరుగులో కూడా కలుపుకోవచ్చు.
 

click me!